పుంగనూరులో సమస్యలు పరిష్కరించేందుకే మీ వద్దకు – ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం మంత్రి పిఏ చంద్రహాస్‌ , ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డితో కలసి మండలంలోని ఈడిగపల్లె, అక్కింవారిపల్లె, చిలకవారిపల్లె గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా …సచివాలయ కార్యదర్శులు , వలంటీర్ల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గమైన పుంగనూరులో ప్రతి ఒక్కరు ఆదర్శంగా పని చేయాలని కోరారు. అర్హులైన ప్రజలందరికి సంక్షేమ పథకాలను అందిస్తామని, అర్హులను విస్మరించే ప్రసక్తే లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మిపతి, తహశీల్ధార్‌ వెంకట్రాయులు, మాజీ ఎంపీపీ నరసింహులు, మాజీ ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, పార్టీ నాయకులు రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, మునిరత్నం, కుమార్‌, సుధాకర్‌, చెంగారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: To solve problems in Punganur- MP Akkisani Bhaskar Reddy

Post Midle
Natyam ad