నేడు వైయస్సార్ చారిటీ ఫర్ పీపుల్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

-ప్రతిఒక్కరూ రక్తదానం పై అవగాహన కలిగి ఉండాలి
-వైయస్సార్ చారిటీ ఫర్ పీపుల్
నెల్లూరు ముచ్చట్లు:
 
వైయస్సార్ చారిటీ ఫర్  పీపుల్ ఆధ్వర్యంలో స్థానిక రంగనాయకులపేట ప్రాంతంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్ చారిటీ మీరు పర్ పీపుల్ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అలీం పేర్కొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో  విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో రక్త నిల్వలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు అనేకం కనిపిస్తున్నాయన్నారు. ఈ నెల 19 తేదీ శనివారం ఉదయం 9:00 నుండి రక్త నిల్వలు సేకరణ జరుగుతుందన్నారు. రక్తదానం పై అవగాహన కలిగిన యువత 9182880185 నంబరును సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. ఒకరి రక్తదానం మరో ముగ్గురికి ప్రాణదానం అవుతుందన్న అవగాహన కలిగిన ప్రతి ఒక్కరు స్పందించి రక్తదాన శిబిరానికి వచ్చి రక్త దాతలుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు నగర పాలక శాఖ డిప్యూటీ మేయర్ మహమ్మద్ ఖలీల్, స్థానిక కార్పొరేటర్ షేక్ అస్మ, 3వ నగర సీఐ అన్వర్  భాషా  తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ చారిటీ ఫర్ పీపుల్ సభ్యులు షేక్ ఇంతియాజ్, అబ్దుల్ రెహమాన్, అల్లా బక్షు, అల్తాఫ్, రహమత్, అస్లిం, సలీం తదితరులు పాల్గొన్నారు.
 
Tags: Today is the mega blood donation camp under the auspices of the Vyassar Charity for People

Natyam ad