నేడు ప్రపంచ వికలాంగుల దినోత్సవం

హైదరాబాద్‌ ముచ్చట్లు:

రెండేళ్ల కిందటి అధికారిక లెక్కల ప్రకారం సుమారు 2.19 కోట్ల మంది వికలాంగులున్న భారతదేశంలో ప్రతిరోజూ 36 మంది వికలాంగ శిశువులు జన్మిస్తున్నారని అంచనా. యు.ఎన్‌.ఓ 1981వ సంవత్సరాన్ని, సార్క్‌ 1993వ సంవత్సరాన్ని వికలాంగుల సంవత్సరాలుగా గుర్తించాయి. శారీరక, మానసిక వికలాంగులకు న్యాయం, సమానత్వం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని రాజ్యాంగంలోని 15 (4), 16 (4) సమానత్వ అధికరణాలు వెల్లడిస్తున్నాయి. వికాలంగుల ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం కోసం ప్రభుత్వం 1976లో ఒక ఉత్తర్వు జారీ చేసింది. దాని ప్రకారం సి, డి క్యాటగిరీ ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్‌ సౌకర్యం వికలాంగులకు లభించింది. 8వ పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి 214 కోట్ల రూపాయలను కేటాయించింది. 1981లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వికలాంగుల సహకారం సంస్థను నెలకొల్పింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలోని వికలాంగుల సంఖ్య 2 కోట్ల 19 లక్షలు. మొత్తం జనాభాలో 2.1 శాతం వికలాంగులున్నారు. వికలాంగులు తమ దైనందిన కార్యక్రమాలు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనువారు, వికలాంగులను ప్రస్తుతం 11 రకాలుగా వర్గీకరించవచ్చు. పూర్తి అందత్వం, పాక్షిక అందత్వం, చెవిటి మూగ, భాషణలోపం, శారీరక వికలాంగులు, బుద్దిమాద్యం, కండరాల క్షీణత, బహుళ వైకల్యం, అభ్యాసన లోపం, ఆటోస్టిక్‌ స్పెక్ట్రం డిజార్డర్‌. 1981ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరంగా ప్రకటించింది. వికలాంగుల కోసం పార్లమెంట్‌లో వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 1995 చేయబడింది. ఇది 1996 ఫిబ్రవరి 7 నుండి అమల్లోకి వచ్చింది. వికలాంగులు జిల్లా మెడికల్‌ బోర్డు వారిచే జారీ చేయబడిన వికలాంగ ధ్రువపత్రం తీసుకోవాలి. ప్రభుత్వం విద్యాపరంగా అందిస్తున్న సేవలు, అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ర్యాంపు సౌకర్యం, వికలాంగులందరికీ ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, వికలాంగ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఇతరుల సహాయంతో పాఠశాలకు వచ్చే వారికి ఎస్కార్టు అలవెన్సు, తీవ్ర వికలాంగత్వంతో ఉన్న వికలాంగులకు ఇంటివద్ద విద్య బోధన, వికలాంగులకు అవసరమైన పరికారాలు. ఉదాహరణకు వీల్‌ చైర్స్‌, ట్రైసైకిల్స్‌, వినికిడి యంత్రాలు, బ్రెయిలీ పలకలు ఉచితంగా పంపిణీ. వికలాంగులకు ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌ పరీక్ష ఫీజులు చెల్లింపులో మినహాయింపు, బధిరులు, అంధులకు పాస్‌ మార్కులు 20 మాత్రమే. ఇతర సదుపాయాలు… ఇంటి నిర్మాణం కొరకు రుణం, ఇంటి నిర్మాణం కొరకు ఖాళీ స్థలం పంపిణీ, 50 శాతం రాయితీతో బస్‌పాస్‌ సౌకర్యం, 75 శాతం రాయితీతో రైల్‌ పాస్‌ సౌకర్యం, ఉద్యోగాలలో 3 శాతం రిజర్వేషన్‌, వివాహ ప్రోత్సాహక బహుమతులు. వికలాంగుల కోసం ప్రభుత్వ ఉత్తర్వులు… జిఓ ఎంఎస్‌ నెంబర్‌ 198 ఎడ్యూకేషన్‌, బదిరులకు ఒకే భాషను అభ్యసించును, జిఓ ఎంఎస్‌ నంబర్‌ 33 ఎడ్యూకేషన్‌ 19-3-2001 పరీక్ష ఫీజు నుండి మినహాయింపు, జిఓ ఎంఎస్‌ నంబర్‌ 42 19-10-2011 ఉద్యోగాలలో ప్రమోషన్లకు రిజర్వేషన్లు. వికలాంగులకు తక్షణమే అవసరమైనవి… బధిరులకు ప్రభుత్వ పాఠశాల, జూనియర్‌ కళాశాల, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రముఖ హాస్టళ్ళకు, ప్రైవేటు పాఠశాలలకు, కళాశాలలకు ర్యాంపు సౌకర్యం, జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యంగా అన్ని పోలీస్‌ స్టేషన్‌, కోర్టులలో సంజ్ఞల భాష, ట్రాన్స్‌లేటర్‌ల నియామకం, నిరుపేద వికలాంగులకు ఎటువంటి నిబంధనలు లేంకుడా పావలా వడ్డీ రుణాలు మంజూరు, ప్రతి టీవీ చానల్‌లో బధిరులకు సైగల భాషలో వార్తలను ప్రసారం చేయాలి. ఇక, గత చరిత్రను, మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము. సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం. సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము. ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది. పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు, ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (డిసంబరు 3) వికలాంగుల గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము… సాధ్యమైనంత వరకూ మనం వికలాంగులు అనే పదం మన వాడుక భాషలో వాడడం లేదు. ఇంగ్లీషులో మాత్రం హేన్డికాప్పుడు, డిజేబుల్ద్‌, ఫిజికాల్లీ చాలేన్జ్ద్‌ అని రక రకాల పదాలలో వాడుతూ ఉంటాము. కాని చాలా మందికి ఎందుకు ఏ పదాన్ని వాడుతున్నామో తెలియదు. అలాంటి సమయాల్లో ఒక్కోసారి మంచి ఉద్దేశ్యాన్ని చెడ్డగాను, చెడ్డ ఉద్దేశ్యం మంచిగాను చెప్పే ప్రమాదము వుంది. కాబట్టి ఈ పరిస్తితి నుండి బయటపడే ప్రయత్నానికి ఈరోజే నాంది పలుకుదాం. ప్రపంచంలో పనికి రాని వాడంటూ ఎవరూ ఉండరు. అలాగని అందరూ తెలివైన వాల్లే ఉండరు. తెలివికి, తెలివిలేని తనానికి మధ్యనే జీవితం. చేయడానికి, చేయలేకపోవడానికి మధ్యలోనే మనం. మనం చేయగలిగినది ఎవరైనా చేయలేక పొతే మనం వాళ్ల కన్నా గొప్ప వాళ్ళం అనుకోవడం సర్వ సాధారణమైపోయింది. అయితే వికలాంగులను అర్ధం చేసుకోడానికి ఐరిస్‌ అనే ఆవిడ ఏమంటారంటే కూర్చున్న చోటినుండి లేవలేక పోవడం శారీరక సమస్య ఐతే, అలా లేవలేక పోవడానికి సరైన సహకారాన్ని అందించక పోవడమే అసలైన వైకల్యం అంటారు. అందుకే సమాజంలో ఎవరు ఏ పని చేసినా, చేయలేకపోయినా దాని వెనుక సమాజం పాత్ర ఎంతైనా వుంటుంది. ఆ సహకారం, ప్రోత్సాహంతో ఎవరైనా ఎంత ముందుకైన వెళ్ళగలం అనే సత్యాన్ని తోటి వారు అవగాహన చేసుకోవాలి. నిజమైన సామర్ధ్యం గురుంచి చర్చించు కుంటే ఎవరు ఎవరినీ తక్కువగా చూడలేము. అలా అర్ధం చేసుకోలేక కొన్ని తరాలుగా కొంత మందిపై నిర్లక్ష్యగా సామర్ధ్యం అని చెప్పి, చేయగలిగినవాళ్ళను కూడా అసమర్ధులుగా మార్చిన సమాజం నుండి బయటికి వచ్చి అందరినీ అర్ధం చేసుకొనే సమాజం వైపు మన పెద్ద వాళ్లు ప్రారభించిన అడుగులు ముందుకు తీసుకు వెల్లడానికి ఈరోజే నిర్ణయం తీసుకుందాం. 1992లో యునైటెడ్‌ నేషన్స్‌ వికలాంగుల సహాయార్దము దీనిని ప్రారంభించినది. అప్పటి నుండి ప్రపంచవ్యాప్తముగా జరుపుకొంటున్నారు. వికలాంగులు మానసికంగా ఆధైర్య పడకుండా ఆత్మస్థైర్యంతో అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్లాలి. వికలాంగులు ఈ రోజు క్రీడలను నిర్వహిస్తారు. వికలాంగ క్రీడాకారులు సాధారణ క్రీడాకారులకు ఏమాత్రం తీసిపోకుండా ఆత్మస్థైర్యంతో క్రీడలలో పాల్గొనాలి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వికలాంగుల పునరావసం, వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. 1995వ సంవత్సరములో కేంద్ర ప్రభుత్వం ద్వారా చట్టం చేయబడి 7-2-96వ తేదీన అమలులోకి తేబడిన వికలాంగుల సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సంపూర్ణ భాగస్వామ్యం చట్టం, 1995 ఒకటవ చాప్టరులో వికలాంగుల నిర్వచనం ఈ విధంగా యివ్వబడి అమలులో ఉంది.

వికలాంగుల హక్కులు పాలకులకు పట్టవా?

వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించినా అవి అందని దాక్షగానే మిగులుతున్నాయి. ఎన్ని పోరాటాలు చేసినా ఫలితం శూన్యమే. ఇంటా బయటా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏదో సాధించాలనే తపన ఉన్నా, తమ కాళ్లపై తాము నిలబడాలనే ఆశ ఉన్నా ఆపన్నహస్తం అందించే వారు లేక సమస్యలతో సతమతవుతున్నారు. నేడు ప్రపంచ వికాలాంగుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. రాష్ట్ర జనాభాలో ఆరు శాతం ఉన్న వికలాంగులకు అన్యాయమే జరుగుతుంది. వారికోసం ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలు, ఉపాధి అవకాశాలు, పునరావాస కార్యక్రమాలు ఎన్నో ఉన్నా..అమలకు నోచుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఏటా డిసెంబర్‌ మూడు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కానీ వారి జీవితాల్లో వెలుగులు నింపలేకపోతున్నారు. మూడు దశాబ్ధాలు కావస్తున్న వాళ్లు హక్కుల సాధనలో విఫలమవుతున్నారు. వృద్ధ వికలాంగులకు ప్రత్యేక హోమ్‌లు నిర్మించాలని, వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వికలాంగులు సాంఘిక, ఆర్ధిక, రాజకీయంగా విద్యా, ఉద్యోగార్జనలో వెనుకంజలోనే ఉన్నారు. వారిని ఆదుకునేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ వికలాంగుల కోసం వెయ్యి రూపాయలు పెన్షన్‌ అందించారు. ప్రస్తుత పాలకులు ఇందులో రకరకాల నిబంధనలు పెట్టి దరఖాస్తులు అనుమతించేందుకే ఆంక్షలు విధిస్తున్నారు. మానసిక, శారీరక వికలాంగుల్లో ఆత్మస్థైర్యాన్ని, జీవితంపై విశ్వాసాన్నినింపేలా వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసం ఎంతైనా ఉంది. శారీరక, మానసిక వైక ల్యాన్ని ఎవరూ కూడా కోరుకోరు. పుట్టుక ద్వారా అవిటితనం కొందర్ని వెంటాడితే, విధి వక్రించడం కారణంగా మరికొందరు ఆ బారిన పడుతారు. ఇందులో ఎవర్ని తప్పు పట్టక్కర్లేదు. భగవంతుడు రాసిన విధి రాత అని తమకు తాము సంతృప్తి పడటమే తప్ప విచారించి ప్రయోజనం లేదు అనే ఓ ధైర్యాన్ని కూడగట్టుకుని తనకు ఇష్టాలకు అనుగుణంగా సహ జంగా సక్రమించే వ్యక్తిగత నైపుణ్యంతో ఆకట్టుకున్నవారేందరూ మానవ ప్రపంచంలో ఎదురుపడుతుంటారు. వారిని స్పూర్తిగా తీసుకుని కొందరు భారతీయ సినీ ప్రపంచంలో అనుభూతికి లోనయ్యే చిత్రాలను అందిస్తే మరికొందరు వైకల్యాన్ని పాయింట్‌గా చేసుకుని అవహేళన చేసిన వారున్నారు. దృశ్య మాధ్యమంలో సినిమా చాలా శక్తివంతమైంది. ప్రభావవంతమైంది అనడంలో సందేహం అక్కర్లేదు. భారతీయ సినీ ప్రపంచాన్ని కళాత్మకం, వాణిజ్యం హద్దులతో సినిమా ప్రస్తానం సాగుతుండగా వాటన్నింటిని చెరిపేసి మానసిక, శారీరక వైకల్యంతో బాధపడేవారిలోనూ అద్బుతమైన నైపుణ్యం, ప్రపంచానికి స్పూర్తినిచ్చే అంశాలుంటాయని పసిగట్టిన కొందరు దర్శకులు తమ చిత్రాలను నిర్మించి ప్రేక్షకులను అబ్బురపరిచారు. కొన్ని కళాత్మకంగా రూపొందింతే, మరికొన్ని వాణిజ్య అంశాలను అధారంగా చేసుకుని హృదయాన్ని తడిమి ప్రేక్షకుడ్ని ఓ అద్బుతమైన అనుభూతికి లోను చేశాయి. వాటిలో సిరిసిరిమువ్వ, సిరివెన్నెల, పదహారేళ్ల వయస్సు లాంటి తెలుగు చిత్రాలు ఆకట్టుకోగా, బాలీవుడ్‌లో తారే జమీన్ పర్, బ్లాక్, బర్ఫీ చిత్రాలు వికలాంగుల్లో కూడా అద్బుతమైన టాలెంట్ ఉంటుందనే భావనను కలిగించాయి. వికలాంగులు సామాన్య మానవుల కంటే తక్కువేమి కాదు అని వారంటే చిన్నచూపు చూసే కొందరికి కనువిప్పును కలిగించాయి. సినిమా మాధ్యమం ద్వారా ఓ అద్బుతమైన భావనను కలిగించిన చిత్రాలను ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఓ సారి నెమరువేసుకుందాం. సిరిసిరిమువ్వ(1978)… సవతి తల్లి వేధింపులకు గురయ్యే మూగ అమ్మాయి హైమాను శారీరకంగా అవిటివాడైన సాంబయ్య అనే వ్యక్తి చేర దీస్తాడు. హైమా అంటే సాంబయ్యకు అభిమానం, తన చేరదీసి ప్రయోజకురాలిగా చేసిన సాంబయ్యపై హైమకు ప్రేమ. ఇలాంటి కథతో తెరకెక్కిన సిరిసిరిమువ్వ చిత్రానికి అప్పట్లో ప్రేక్షకులు నీరాజనం పట్టారు. సిరివెన్నెల (1986)… అంధుడైన ఓ ఫ్లూటిస్ట్ హరిప్రసాద్ (సర్వదమన్ బెనర్జీ)కి, మూగ పెయింటర్ సుభాషిణి (సుహాసిని)కు, జ్యోతిర్మయి (మున్ మూన్ సేన్) మధ్య జరిగిన ప్రేమకథను సిరిసిరిమువ్వగా ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ తెరెక్కించారు. హరిప్రసాద్‌లో ఉన్న టాలెంట్‌ను గుర్తించి జ్యోతిర్మయి ప్రోత్సాహానందిస్తుంది. ప్రోత్సాహం ఉంటే రాణిస్తారు అని హరిప్రసాద్ పాత్ర ద్వారా దర్శకుడు తెలియచెప్పాడు. ప్రకృతిని అంధుడైన ఓ సంగీత కారుడు ఎలా ఆస్వాదిస్తాడు. మూగ యువతి ఓ అంధుడికి తన భావాల్ని ఎలా వ్యక్త పరిచిందనే అంశాలతో సృజనాత్మక శైలిలో రూపొందించిన ‘సిరిసిరిమువ్వ’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా గొప్ప విజయం సాధించింది. బ్లాక్(2005)… మిచెల్లీ మ్యాక్‌నాలీ(రాణిముఖర్జీ) రెండేళ్ల వయస్సులోనే అనారోగ్యానికి గురవ్వడంతో అంధత్వం, చెవుడు వస్తుంది. తల్లితండ్రుల ప్రేమకు దూరమైన సమయంలో ఉపాధ్యాయుడు దేబరాజ్ సహాయ్ (అమితాబ్) చేర దీస్తాడు. ఉపాధ్యాయుడు అల్జీమర్స్ వ్యాధికి గురవుతాడు. వీరిమధ్య చోటు చేసుకుంటున్న సంఘటనలు ప్రేక్షుకుడిని ఉద్వేగాని గురి చేయడమే కాకుండా కంటతడి పెట్టించి ఓ అద్భుతమై ఫీలింగ్ గురయ్యేలా చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలీ నిర్మించారు. వైకల్యం అనేది శారీరానికే మనసుకు కాదు అనే గొప్ప పాయింట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తారే జమీన్ పర్ (2007)… డిస్‌లేక్సియా అనే వ్యాధితో బాధపడుతున్న నంద కిశోర్ అవస్థి (ద ర్శిల్ సఫారీ)ని కన్నవారే ఆదరించ కపోగా, ఇంట్లో సమస్యలు సృష్టిస్తున్నారనే కారణంతో బోర్డింగ్ స్కూల్లో చేర్చుతాడు. మానసికంగా ఎదుగుదల లేకున్నా నందకిశోర్‌లో మామూలుగా ఉండే పిల్లలకంటే ఎక్కువ నైపుణ్యం, టాలెంట్ ఉందని గ్రహించిన ఉపాధ్యాయుడు రామ్ శంకర్ నిఖంబ్(అమీర్ ఖాన్) పోత్స్రాహాన్ని అందిస్తాడు. టీచర్ ప్రోత్సాహంతో నంద కిశోర్ పాఠశాలలో ఉత్తమ పెయింటర్‌గా ఎంపికవుతాడు. బర్ఫీ (2012)… బుద్దిమాంద్యంతో బాధపడే జిల్‌మిల్ చటర్జీ(ప్రియాంక చోప్రా), జాన్సన్(రణబీర్ కపూర్) మూగ, చెవిటితో బాధపడే యువకుడు, శృతి ఘోష్(ఇలియానా)కు మధ్య జరిగిన ప్రేమకథగా బర్ఫీ రూపొందింది. వీరిద్దరీ మధ్య జరిగిన కథను ఆకట్టుకునే విధంగా రొమాంటిక్, కామెడీ, డ్రామాలను మేలివించి ఓ అందమైన ప్రేమకథగా తెరకెకించారు అనురాగ్ బసు. ప్రేమానురాగాలు పంచితే మానసికంగా సంపూర్ణ వ్యక్తులుగా ఎదుగుతారనేది ఈ చిత్రంలో ప్రధాన అంశం. పైన తెలిపిన చిత్రాల్లో హైమా, సాంబయ్య, హరిప్రసాద్, సుభాషిణి, నంద కిశోర్, మిచెల్లీ, జిల్‌మిల్, జాన్సన్, దేబ్‌రాజ్ సహాయ్ లాంటి పాత్రలు సమాజంలో మనకు కనిపించడం సహజం. శారీరక, మానసిక వైకల్యంతో బాధపడే వారిలో స్కిల్స్, టాలెంట్‌లు పుష్కలంగా ఉంటాయని దర్శకులు తమ కోణంలో చూపించారు. శారీరక, మానసిక వైకల్యంతో బాధపడే వ్యక్తులకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశ్యాన్ని అంతర్లీనంగా ప్రేక్షకులకు తెలియ చెబుతూనే సమాజం పట్ల వారి భాద్యతను చెప్పారు దర్శకులు. సమాజంలో ఎదో ఒక వైకల్యంతో బాధపడేవారిని చేర దీసి పోత్రాహాన్ని అందిస్తే వాళ్లు రాణిస్తారు అని మనవంతు ఓ బాధ్యతగా ఫీలవుదాం.

 

Tag : Today is the World Disabled Day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *