Tollgate staff attack MLA

టోల్గేట్ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి

Date : 12/12/2017
కరీంనగర్‌ ముచ్చట్లు:
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట టోల్ప్లాజాలో చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ వీరంగం సృష్టించారు. తన వాహనాన్ని వరుసలో వెళ్లమని చెప్పినందుకు టోల్ సిబ్బందిపై ఆమె దాడికి పాల్పడ్డారు. చొప్పదండి నుంచి హైదరాబాద్కు తన కారులో వెళ్తున్న ఎమ్మెల్యే తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట వద్ద గల టోల్గేట్ వద్దకు రాగానే వీఐపీలు వెళ్లే మార్గంలో ఓ వాహనం చెడిపోయి ఆగిపోయింది. దీంతో అన్ని వాహనాలు సాధారణ ప్రయాణికుల మార్గంలోనే వెళ్లాలని టోల్గేట్ సిబ్బంది సూచించారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే వారిపై దాడికి పాల్పడ్డారు. వద్దని వారిస్తున్న మరో వ్యక్తిపై గన్మెన్లు దాడి చేశారు. వారిని అసభ్య పదజాలంతో దూషిస్తూ సెల్ఫోన్ లాక్కున్నారు.
దీనిపై టోల్సిబ్బంది స్థానిక ఎల్ఎండీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏసీపీ ఉషారాణి సిబ్బందితో సహా అక్కడికి చేరుకుని టోల్ సిబ్బందిని అడిగి వివరాలు సేకరించారు. మొదట ఈ ఘటనపై ఏసీపీ మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. అదే సమయంలో ఫోన్కాల్ వచ్చింది.
దీంతో తాను మాట్లాడనని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Tags : Tollgate staff attack MLA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *