పై అధికారులే నిందలు వేస్తున్నారు.

మైదుకూరు ముచ్చట్లు:
వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం మైదుకూరు మండలం లోని మిట్టమానుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి పై కొందరు అధికార పార్టీ నాయకులం అని చెప్పుకుంటూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు విన్నవించిన సంగతి తెలిసిందే. అయితే పై స్థాయి అధికారులు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఇటువంటి చర్యలకు భయపడేది లేదని, న్యాయం నా వైపే ఉందని, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, ఆ బాధ్యత ప్రకారం విధులు నిర్వహిస్తున్నమని, పై స్థాయి అధికారులు తనపై లేనిపోని నిందలు మోపడం సమంజసం కాదని, న్యాయం తనవైపే ఉందని, ఈ తరుణంలో నా తోటి ఉద్యోగులు నాకు అండగా నిలబడతారని ఆశిస్తున్నాను అని అన్నారు.
దాతల సహాయంతో కష్టపడి చదువుకొని ఉద్యోగం సాధించాను. అవసరమైతే న్యాయ పోరాటం అయినా చేస్తాను. భయపడుతూ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదని కరాఖండిగా తెలియజేశారు. ఉన్నతాధికారులు నాకు అండగా నిలబడతారని ఆశిస్తున్నాను అని అన్నారు. తనపై దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్న వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీ వార్లకు మరొకమారు విన్నవించారు.
 
Tags:Top officials are blaming

Natyam ad