రైతు పోరుకు మద్దత్తు తెలిపిన టిపిసిసి నాయకులు జువ్వాడి కృష్ణారావు

కోరుట్ల  ముచ్చట్లు:
 
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మూసి వేసిన నిజాం చక్కెర ఫ్యాక్టరీలను వెంటనే తెరిపిం చాలని,అలాగే కేంద్ర ప్రభుత్వం వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేసి పసుపుకు రూ.15,000 మద్దత్తు ధర చెల్లించాలని కోరుతూ కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలం ముత్యం పెట్ లోని నిజాం చక్కెర ఫ్యాక్టరీ నుండి  జిల్లా రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన  పాదయాత్ర కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు జువ్వాడి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దత్తు తెలిపారు. ఇందులో భాగంగా మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ వద్ద రైతుల పాదయాత్రకు ఎదురుగా వెళ్లి పూల మాలలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రైతులతో కలసి కొంత దూరం పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేసి వారి జీవితలతో చెలగాటం అడుతున్నారని , ఈ దుష్ట తెరాస, బీజేపీ ప్రభుత్వాలకు కాలం దగ్గర పడిందని అన్నారు. ఇప్పటికైనా ఈ పాలకులు కళ్ళు తెరిచి రైతుల న్యాయమైన డిమాండ్ లను ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని జువ్వాడి కృష్ణారావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
 
Tags: TPCC leaders Juvvadi Krishna Rao expressed support for the peasant struggle

Natyam ad