TRACK YOGA PARTY TRAVEL

జగన్‌ పాదయాత్రను విజయవంతంచేయండి

Date : 26/12/2017

పుంగనూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి ఈనెల 28 న వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర ప్రారంభమౌతుందని, దీనిని విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి రెడ్డెప్ప పిలుపునిచ్చారు. వైఎస్సాఆర్సీపి నాయకులు జెడ్పిఫ్లోర్‌లీడర్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఎంపిపి నరసింహులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్రల ఆధ్వర్యంలో పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డెప్ప మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డిల సూచనల మేరకు పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నేతలు శంకరప్ప, ఖాదర్‌బాషా, సుబ్బన్న, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

YCP
YCP

Tags : TRACK YOGA PARTY TRAVEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *