Traffic restrictions in Hyderabad tomorrow

రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు

Date : 12/12/2017
హైదరాబాద్‌ ముచ్చట్లు:
సరూర్నగర్ స్టేడియంలో రేపు జరిగే తెలంగాణ లంబాడీల శంఖారావం బహిరంగసభకు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఇటీవల జరిగిన ఆదివాసీల సభ వలన జరిగిన ట్రాఫిక్ సమస్య దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పలు మార్గాల నుంచి వచ్చే వాహనాలకు పార్కింగ్ పాయింట్లను కేటాయించారు.
– విజయవాడ, వరంగల్ నుంచి సభకు వచ్చే వాహనాలు నాగోలులోని మెట్రో స్టేషన్ సమీపంలో హెచ్ఎండీఏ లేఅవుట్లో పార్కింగ్ చేయాలి.
– ఇబ్రహీంపట్నం నుంచి వచ్చే వాహనాలు బీఎన్రెడ్డి నగర్ సమీపంలోని ప్లెటెక్ ఏవియేషన్ మైదానంలో పార్కు చేయాలని, కర్మన్ఘాట్ వైపు నుంచి వచ్చే వాహనాలు కర్మన్ఘాట్లోని ధ్యానాంజనేయస్వామి ఆలయం వద్ద పార్కు చేయాలి.
– సికింద్రాబాద్ వైపు నంచి వచ్చే వాహనాలను ఉప్పల్లోని క్రికెట్ స్టేడియం సమీపంలో పార్కు చేయాలి.
– ఎల్బీనగర్ నుంచి వచ్చే వాహనాలను డీసీపీ కార్యాలయం సమీపంలో ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పార్కు చేయాలి.
– రేపు ఉదయం 8గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎల్బీనగర్ నుంచి దిల్సుఖ్నగర్ వరకు సభకు వచ్చే వాహనాలకు అనుమతిలేదని రాచకొండ ట్రాఫిక్ డీసీపీ రమేష్నాయుడు తెలిపారు.
Tags : Traffic restrictions in Hyderabad tomorrow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *