నెల్లూరు జిల్లాలో  విషాదం

నెల్లూరు ముచ్చట్లు:
 
నెల్లూరు జిల్లా ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఇదీ ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా శోకతప్త హృదయంతో మునిగిపోయింది. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తన బంధుమిత్రులు సాటి మంత్రులు ఇతర పార్టీ శ్రేణులను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ.. మాసివ్ హార్ట్ అటాక్ కారణంగా కన్ను మూశారు.మృతి పట్ల అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. స్థానికులు, కార్యకర్తలు గౌతమ్‌రెడ్డికి ఘన నివాళులు అర్పించారు. ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. గౌతమ్‌ రెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని నివాసానికి తరలించారు. సోమవారం రాత్రికి స్వగ్రామం బ్రహ్మణపల్లికి తరలించనున్నారు. అమెరికాలో ఉన్న కుమారుడు వచ్చాక బుధవారం అధికార లాంఛనాలతో గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.గౌతమ్ రెడ్డి మరణ వార్తను తాను నమ్మలేక పోయానని అన్నారు ఏపీ సీఎం వైయస్ జగన్. ప్రస్తుతం వైయస్ జగన్ ప్రభుత్వంలో పరిశ్రమలు వాణిజ్య ఐటీ శాఖా మంత్రిగా పని చేస్తున్నారు.. గౌతమ్ రెడ్డి. 1971 నవంబర్ 2న జన్మించారు మేకపాటి గౌతమ్ రెడ్డి. జగన్ కి క్లాస్ మేట్ అయిన గౌతమ్ రెడ్డి.. ఇంగ్లండ్ లోని మాంచెస్టర్ యూనివర్శిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి కుమారుడైన గౌతమ్ రెడ్డి.. ముగ్గురు కుమారుల్లో ఒకరు. 2014లో రాజకీయ తెరంగేట్రం చేసిన ఆయన నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నుంచి తొలిగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2014తో పాటు 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసీపీ నుంచి ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు.వారం రోజుల దుబాయ్ పర్యటన ముగించుకుని నిన్ననే హైదాబాద్ చేరుకున్న మేకపాటి గౌతమ్ రెడ్డికి సడెన్ గా గుండెపోటు రావడం. ఆస్పత్రిలో చేరడం.. ఆ వెంటనే హఠాన్మరణం పాలవడం జరిగిపోయాయి. ప్రస్తుతం మేకపాటి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
 
 
 
ఎంతో ఆరోగ్యంగా ఉండే గౌతమ్ రెడ్డి ఇలా ఉన్నట్టుండి చనిపోవడం అందరికీ షాకింగా మారింది. గౌతమ్ రెడ్డి ఎంతో ఆరోగ్యంగా ఉంటారనీ. కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారనీ. హోటల్లో కూడా జిమ్ ఫెసిలిటీ చూసుకుంటారనీ చెబుతుంటారు ఆయన గురించి బాగా తెలిసిన వారు. నెల్లూరు ముద్దుబిడ్డగా పేరున్న గౌతమ్ రెడ్డి జిల్లాలో ఎక్కడా ఎవరితోనూ వివాదాల్లేకుండా ఉంటారనీ. ఆయనెంతో మృధుస్వభావిగా ఉంటారని చెబుతున్నారు ఆయన బంధు మిత్రులు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ రెడ్డి కనీసం కోపతాపాలు ప్రదర్శించని వ్యక్తిగా పేరుందని చెప్పుకొస్తున్నారు. మంత్రి, ఎమ్మెల్యేలన్న తేడా చూపేవారు కాదనీ. మేకపాటి గౌతమ్ రెడ్డి అందరితోనూ కలిసిపోతారనీ అంటున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి యంగ్ అండ్ డైనమిక్ లీడరనీ. టెక్నోక్రాట్ గా ఆయనకు పేరుందనీ. అందుకే ఆయనకు ఐటీ మంత్రిగా సీఎం జగన్ అవకాశమిచ్చారనీ అంటున్నారు ఆయనతో కలసి పని చేసిన సాటి మంత్రులు. జగన్ తన మంత్రి వర్గం నుంచి ఏం ఆశిస్తారో.. దాన్ని అందించడంతో పాటు.. ప్రజా పనులను ముందుకు తీసుకెళ్లడంలో గౌతమ్ రెడ్డి ముందుంటారనీ అంటున్నారు పార్టీ వర్గాల వారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక స్కిల్ డెవలప్ మెంట్ లో గౌతమ్ రెడ్డి ఎంతో స్టడీ చేశారనీ. దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో రేయింబవళ్లూ శ్రమించారనీ అంటున్నారు.బ్రిటీష్ యూనివర్శిటీలో చదువుకున్న వ్యక్తిగా మాత్రమే కాకుండా తనకున్న ఎన్నో ఇండస్ట్రీస్ ను నడిపిన బిజినెస్ పర్శనాల్టీగానూ ఆయనకున్న అనుభవాన్ని.. ప్రభుత్వసేవలకోసం వాడారని చెబుతున్నారు ఇతర మంత్రులు. గౌతమ్ రెడ్డి మరణం పార్టీకి తీవ్ర నష్టమనీ. అంతే కాకుండా రాష్ట్రానికీ తీరని లోటని అంటారు ఇతర మంత్రులు. ఆయన ఆరోగ్యం చూసి తాము బాహుబలిగా వర్ణించేవారమనీ.
 
 
 
విద్యుత్ మీద అసెంబ్లీలో ఆయనిచ్చిన స్పీచ్ తర్వాత తమకెంతో గౌరవం ఏర్పడిందనీ అంటున్నారు తోటి మంత్రులు. గౌతమ్ రెడ్డికి వివాద రహితుడిగా పేరుంది. సీఎం జగన్ కి అత్యంత ఇష్టమైన మంత్రిగా పేరుంది. రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు రావడానికి కృషి చేసిన మంత్రిగా వర్ణిస్తున్నారు వైసీపీ శ్రేణులు.గౌతమ్ రెడ్డి తన చుట్టూ ఉన్న అందరికీ ఫిట్ నెస్ పాఠాలు చెబుతుంటారు. మనమంతా ఎంతో ఆరోగ్యంగా ఉండి ప్రజా సేవ చేయాలనీ. అలాంటి గౌతమ్ రెడ్డి కి ఉదయం ఆరు గంటల సమయంలో మాసివ్ హార్ట్ అటాక్ వచ్చిందనీ. దీంతో అపోలో ఆస్పత్రికి తరలించారనీ. అయినా సరే ప్రయోజనం లేకుండా పోయిందనీ అంటున్నారు వైద్యులు. సాధారణంగా ఐదారు గంటల్లో లేచి జిమ్ చేస్తుంటారు గౌతమ్ రెడ్డి. ఆ సమయంలో ఆయనకు మాసివ్ హార్ట్ అటాక్ వచ్చిందని చెబుతున్నారు ఆయన సహాయకులు.గౌతమ్ రెడ్డి ఎంతో ప్యాషనేట్ గా గౌతమ్ రెడ్డి ఉండేవారనీ. పార్టీలకు అతీతమైన వ్యక్తిగా ఆయనకు రాజకీయ వర్గాల్లో పేరు ప్రతిష్టలున్నాయని అంటున్నారు. మంత్రిగా ఆయన వయసు మూడేళ్లు. ఇప్పటి వరకూ ఏ చిన్న రిమార్క్ కూడా లేని వ్యక్తిగా గౌతమ్ రెడ్డి బిహేవ్ చేశారనీ. ఒకరిపై విరుచుకుపడ్డం కానీ, విమర్శలు చేసే అలవాటు కానీ ఉండేది కాదనీ. అలాంటి గౌతమ్ రెడ్డికి ఇలా గుండె పోటు వస్తుందని అస్సలు ఊహించలేక పోయామని అంటున్నారు .
 
 
 
 
గౌతమ్ రెడ్డి సన్నిహితులు. గౌతమ్ రెడ్డి మరణించారంటే నమ్మలేక పోతున్నామని అంటున్నారు ఆయన స్నేహితులు. నియోజవర్గంలోని వారందరికీ, జిల్లాలోని ప్రజలందరికీ గౌతమ్ రెడ్డి దూరం కావడం తీవ్ర విషాదకరం అంటుంటే.. ఇక ఆ కుటుంబానికి ఇంకెంత బాధాకరమో ఊహించుకోవచ్చిని అంటున్నారు జిల్లా నాయకులు.అందరితోనూ ఎంతో మంచిగా ఉండే నెల్లూరీయుడిగా ఆయనకు ఎంతో కీర్తి ప్రతిష్టలున్నాయనీ. జిల్లా నుంచి ఒక మంత్రిగా ఆయనెంతో పేరు తీసుకొచ్చారనీ. ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన రెడ్డి చెప్పింది చెప్పినట్టు సామాన్య ప్రజానీకంలోకి తీసుకెళ్లడంలో గౌతమ్ రెడ్డికి ప్రత్యేక శైలి ఉందని అంటున్నారు జిల్లా నాయకులు. చదువుకున్న వ్యక్తి నిరాడంబరంగా ఉండేవారు కుటుంబానికి రాజకీయ, వ్యాపార నేపథ్యాలున్నా సరే.. సాధారణ ప్రజానీకంతో అత్యంత సాన్నిహిత్యంగా ఉండేవారనీ గౌతమ్ రెడ్డి హఠాన్మరణం జీవితకాలపు తీరని లోటని అంటున్నారు.. వైసీపీ శ్రేణులు.హైదరాబాద్ తోనూ గౌతమ్ రెడ్డికి ఎంతో అనుబంధముందని అంటారు తెలంగాణకు చెందిననాయకులు. దీంతో గౌతమ్ రెడ్డి మరణం తమకు షాకింగా ఉందని అంటున్నారు తెలంగాణ లీడర్లు. గౌతమ్ రెడ్డి నిన్న రాత్రి ఒక నిశ్చితార్ధంలో పాల్గొన్నారు.
 
 
 
 
ఇంతలో ఉన్నట్టుండి ఆయన మరణించడం తమకు నమ్మశక్యంగా లేదంటున్నారు ఆయన్ను నిన్న చూసిన వారు. మేకపాటి కుటుంబానికి రాజకీయాలకు అతీతమైన పేరు ప్రతిష్టలున్నట్టు చెబుతున్నారు ప్రతిపక్ష పార్టీల వారు.రాజకీయాలలో ప్రత్యేక శైలి, విలక్షణ పంథాతో కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా మంచిపేరు తెచ్చుకున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర ప్రజలు, నేతలు గౌతమ్ రెడ్డికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఫ్లాట్ నంబర్ 963, రోడ్డు నంబర్ 48, జూబ్లీహిల్స్, చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనున్న గౌతమ్ రెడ్డి భౌతికకాయం కాసేపట్లో చేరుకోనుంది. సాయంత్రం వరకూ ప్రజలు, అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని మంత్రి నివాసంలో ఉంచనున్నారు కుటుంబసభ్యులు.. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మంత్రి నివాసానికి భౌతికకాయం తరలిస్తారు. అమెరికాలో ఉన్న మంత్రి కుమారుడు అర్జున్‌రెడ్డి రేపటికి ఇండియా రానున్నారు. బుధవారం నెల్లూరులోనే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా కుటుంబ సభ్యుల సన్నిహితులు చెబుతున్నారు.
 
Tags: Tragedy in Nellore district

Natyam ad