Tragedy in Vizianagaram district

విజయనగరం జిల్లాలో విషాదం

Date : 12/12/2017
విజయనగరం  ముచ్చట్లు:
జిల్లాలోని బొబ్బిలి మండలం, బంకురువానివలస క్వారీలోజరిగిన పేలుడులో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే బొబ్బిలి మండలం, బంకురువానివలస గ్రామ పరిసర ప్రాంతంలో సర్వాజీ మైనింగ్స్ సంస్థ నిర్వహిస్తున్న క్వారీలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు ఎం. వెంకట్ (33), అచ్చయ్య (55) ప్రమాదంశాత్తు మృతి చెందారు. గని కింది భాగంలో రాళ్లను పెకలిస్తుండగా పై నుంచి పెద్ద బండరాయి పడడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో మృతుల బంధువులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని మైనింగ్ కార్యాలయంపై దాడి చేశారు. సమాచారం అందుకున్నపోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకుని బాధితులను ఓదార్చి నష్టపరిహారం ఇప్పిస్తామని నచ్చచెప్పడంతో వారు శాంతించారు.
Tags : Tragedy in Vizianagaram district


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *