Tragic tour

విషాద పర్యటన

04/112018

సేలం ముచ్చట్లు:

కాంచీపురం జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. వివరాలు.. చెన్నైలోని మన్నాడ్డి ప్రాంతంలోని బోర్కర్ మర్చంట్ వీధికి చెందిన తొమ్మిది మంది యువకులు దీపావళి సెలవుల్లో పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కారులో సజావిక్ (25), రియాజ్ (20), ఫైసల్ (24), యాకుప్ (25), ఆసిఫ్ (21), ఇంతియాజ్ (23), మహమ్మద్ యాసిఫ్,  ఇన్సాద్ ఇర్ఫాన్ ( 25 ), ఇన్సా (25 ) ఉన్నారు. వీరంతా స్నేహితులు. వారిలో ఫైసల్ కారును నడిపాడు.

కారును ఢీకొన్న లారీలు..

కారు వేలూరు వైపుగా కాంచీపురం సమీపం చెన్నై – బెంగళూరు జాతీయ రహదారిలోని చిన్నయ్యన్ సత్రం వద్ద వెళుతోంది. యువకులంతా ఆనందంగా పాటలు పాడుకుంటూ వెళుతున్నారు. వెనుకనే వస్తున్న ఓ లారీ అకస్మాత్తుగా వేగం పెంచి కారును ఢీకొంది. దీనితో అదుపు తప్పిన కారు రోడ్డు డివైడర్ ను దాటి అవతలి రోడ్డుపై ఎక్కింది. అదే సమయంలో వేలూరు నుంచి చెన్నైకి వెళ్తున్న కంటైనర్ లారీ వేగంగా కారును ఢీకొంది. దీనితో కారు నుజ్జు నుజ్జయి కారులోని సలీమ్ కుమారుడు సజావిక్ (25), రియాజ్(20) , కారు నడిపిన ఫైసల్ (24) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. యాకుప్ (25), ఆసిఫ్ (21), ఇంతియాజ్(23), మహమ్మద్ యాసిఫ్, ఇన్సాద్ ఇర్ఫాన్ ( 25 ) ఇన్సా (25) తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసుల విచారణ..

అందిన సమాచారంతో డీఎస్పీ బాలసుబ్రమణియన్ తాలూకా సీఐ వెట్రిసెల్వన్ పోలీసులు రెండు అంబులెన్సులు రెండు అగ్నిమాపక వాహనాల్లో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కాంచీపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను కూడా అదే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ప్రమాదంలో మృతిచెందిన ఫైసల్ తమ్ముడు ఆసిఫ్ విషయం తెలియడంతో చెన్నై నుంచి యువకుల కుటుంబీకులు ఆసుపత్రికి చేరుకున్నారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలతో ఆస్పత్రి దద్దరిల్లింది.

ఆశాజనకంగా పత్తిరేటు

Tags:Tragic tour

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *