నిరుద్యోగ యువ‌త‌కు జ‌ల క్రీడ‌ల‌లో శిక్ష‌ణ‌

-సంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా
Date:14/02/2018
అమరావతి ముచ్చట్లు:
ప‌ర్యాట‌క రంగం ఉపాధికి మార్గం చూపేలా ఉండాల‌న్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయిడు ఆలోచ‌న‌ల మేర‌కు నిరుద్యోగ యువ‌త‌కు జ‌ల క్రీడ‌ల‌లో శిక్ష‌ణ‌ను అందిస్తున్న‌ట్లు ప‌ర్యాట‌క‌, భాషా సంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా వివ‌రించారు. ఈ క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ టూరిజం అధారిటీ గోవాలోని జాతీయ జ‌ల‌క్రీడ‌ల సంస్ధ‌తో ప్ర‌త్యేక ఒప్పందం చేసుకుంద‌న్నారు. ప‌ర్యాట‌క రంగ ప‌రంగా జ‌ల క్రీడ‌ల‌కు ఆద‌ర‌ణ పెరుగుతున్న త‌రుణంలో నిపుణుల కొర‌త త‌లెత్తుతుంద‌ని, దానిని అధిక‌మించే క్ర‌మంలో  నిరుద్యోగుల‌కు ఈ శిక్ష‌ణ‌ను అందిస్తున్నామన్నారు. తొలి ద‌శ‌లో అనంత‌పురం టూరిజం హ‌బ్ నుండి 15 మంది నిరుద్యోగుల ఎంపిక జ‌రుగుతుంద‌ని, ద‌శ‌ల వారిగా అన్ని టూరిజం హ‌బ్‌ల నుండి ఎంపిక‌లు నిర్వ‌హించి నిరుద్యోగుల‌కు ఉపాధి చూపుతామ‌ని ముఖేష్ కుమార్ మీనా వివ‌రించారు. గోవాలో రెండు ర‌కాల శిక్ష‌ణ‌లు అందిస్తార‌ని, బీచ్ లైఫ్ గార్ఢు పేరిట లైఫ్ సేవింగ్ నైపుణ్య‌త‌ల విషయంలో పూర్తి స్ధాయి అవ‌గాహన క‌ల్పిస్తార‌న్నారు. టిల్ల‌ర్ విభాగంలో ప‌వ‌ర్ బోట్ న‌డ‌ప‌టం, నిర్వ‌హ‌ణ ప‌రంగా పూర్తి స్ధాయి శిక్ష‌ణ ఉంటుంద‌న్నారు. విశాఖ సాగ‌ర తీరంలో బీచ్ లైఫ్ గార్డుల అవ‌శ్య‌క‌త ఎంతో ఉంద‌ని, శిక్ష‌ణ త‌దుప‌రి అవ‌స‌రాన్ని బ‌ట్టి వారికి ప‌ర్యాట‌క శాఖ‌లోనే ఉపాధి చూపే అవ‌కాశం లేక‌పోలేద‌ని మీనా తెలిపారు. శిక్ష‌ణ కోసం జాతీయ జ‌ల క్రీడ‌ల సంస్ధ‌కు మూడు ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ప‌ర్యాట‌క శాఖ చెల్లిస్తుంద‌ని, అభ్య‌ర్ధుల ర‌వాణా, వ‌స‌తి, భోజ‌నం వంటి స‌దుపాయాల ఖ‌ర్చు ఈ మొత్తానికి అద‌న‌మ‌ని కార్య‌ద‌ర్శి వివ‌రించారు.ఇలా ఒక్కో అభ్య‌ర్ధిపైనా స‌గ‌టున రూ.37వేల వ‌ర‌కు ప‌ర్యాట‌క శాఖ నిధులు వ్య‌యం చేయ‌నుంద‌న్నారు. ప‌వ‌ర్ బోట్ నిర్వ‌హ‌ణలో శిక్ష‌ణ పొందిన వారికి దేశ వ్యాప్తంగా అవ‌కాశాలు ఉన్నాయ‌ని, అంత‌ర్జాతీయ స్ధాయిలో సైతం ఉపాధిని పొంద‌గ‌లుగుతార‌న్నారు. ప్ర‌తి రంగం అభివృద్దిలోనూ ఉపాధి కీల‌కంగా ఉండాల‌న్న ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కు ఈ కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న చేసామ‌ని, ముఖేష్ కుమార్ మీనా వివ‌రించారు. అభ్య‌ర్ధుల ఎంపిక, ఇత‌ర అంశాల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ టూరిజం అధారిటీ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి హిమాన్హు శుక్లా ప‌ర్య‌వేక్షిస్తార‌న్నారు.
Tags: Training in water sports for unemployed youth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *