కొత్త వాహనానికి పాత వాహనం  నంబర్ బదిలీ

– గుజరాత్ లో అమల్లోకి కొత్త నిబంధలు
 
ముంబై  ముచ్చట్లు:
 
కొత్త వాహనాన్ని తీసుకున్నంతనే.. దానికి సరిపోయే నెంబరు కోసం కొందరు పడే హడావుడి అంతా ఇంతా కాదు. కొందరు అయితే.. కొత్త వాహనం కొనటానికి ముందే.. తాము కోరుకున్న నెంబరు కోసం ప్రయత్నాలు చేసేవారు లేకపోలేదు. అంతేనా.. ఏదైనా సిరీస్ మారే అవకాశం ఉందని తెలిసినప్పుడు.. వెంటనే వాహనం కొనకుండా.. ఆ సిరీస్ వచ్చే వరకు వెయిట్ చేసే వాళ్లు లేకపోలేదు.ఇలా.. వాహనదారులు తమ వాహనాలకు సూట్ అయ్యే  నెంబరు కోసం విపరీతమైన ప్రాధాన్యత ఇస్తుంటారు. వాహనంతో పాటు.. నెంబరు కూడా పోవటం చూస్తుంటాం. అయితే.. తాజాగా గుజరాత్ లో కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు.పాత వాహనాన్ని అమ్మేసినా.. మూలన పడేసినా.. జీవితకాలం అయిపోయి తుక్కుగా మార్చినా.. ఆ వాహనానికి ఉన్న నెంబరును మాత్రం సదరు యజమానికి కొనుగోలు చేసి.. కొత్త వాహనానికి బదిలీ చేసుకునే కొత్త వీలు గుజరాత్ లో తీసుకొచ్చారు. వాస్తవానికి ఈ విధానం ఇప్పటికే ఢిల్లీ.. యూపీ.. పశ్చిమ బెంగాల్ లో ఉంది. ఈ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాన్ని గుజరాత్ లోనూ అమల్లోకి తీసుకొస్తున్నట్లుగా రాష్ట్ర మంత్రి పూర్ణేష్ మోదీ వెల్లడించారు.
 
పాత వాహనాలకు కేటాయించిన నెంబరును కొత్త వాహనాలకు బదిలీ చేసుకునేలా తీసుకొచ్చిన ఈ నిబంధనకు కొన్ని కండీషన్లు ఉన్నాయి. ఈ నెంబరు బదిలీ.. సెకండ్ హ్యాండ్ వాహనాలకు లేదు. కొత్తగా కొన్న వాటికి మాత్రమే ఇస్తారు. అంతేకాదు.. ఒక కారు నెంబరు కారుకే బదిలీ చేయాలే తప్పించి.. ఆటోకు వాడతానంటే కుదరదు. అయితే.. ఇందుకు కొంత మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది.
టూవీలర్ వాహనాలకు గోల్డెన్ కేటగిరీ ఫ్యాన్సీ నెంబర్లకు రూ.8వేలు.. సిల్వర్ కేటగిరీ నెంబర్లకు రూ.3500.. ఇతర నంబర్లకు రూ.2వేలు చెల్లించాల్సి ఉంటుంది. అదే కార్లకు సంబంధించి గోల్డెన్ కేటగిరి నెంబర్లకు రూ.40 వేలు.. సిల్వర్ కు రూ.15వేల.. ఇతర నెంబర్లకు రూ.8వేలు చెల్లించి.. పాత నెంబర్లను ఎంచక్కా తమతో ఉంచేసుకోవచ్చు. ఇదే విధానాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయొచ్చు కదా? అన్న మాట వినిపిస్తోంది. మరేం చేస్తారో చూడాలి.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Transfer of old vehicle number to new vehicle

Natyam ad