మెట్రో రైలులో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రయాణం

హైదరాబాద్ ముచ్చట్లు :
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదగా ప్రారంభం కానున్న మెట్రో రైలులో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహా, పలువురు మంత్రులు శనివారం మెట్రో రైలులో ప్రయాణించారు. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి మెట్టుగూడా వరకు 8 కి.మీ. మార్గంలో రైలులో ప్రయాణించడంతోపాటు.. మెట్రో స్టేషన్లు, రైలు పనితీరును తెలుసుకున్నారు. మంత్రులతోపాటు ఎంపీలు, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, మీడియా ప్రతినిధులు సైతం ఈ ట్రయల్ రన్లో పాల్గొన్నారు.మరోవైపు మెట్రో తుది దశ పనులను తెలంగాణ ఉన్నతస్థాయి అధికారులు పరిశీలించారు. మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి, రంగారెడ్డి కలెక్టర్ రఘునందనరావు పర్యవేక్షించారు. తుది దశ పనులను వెంటనే పూర్తి చేయాలని సీఎస్ ఎస్పీ సింగ్ అధికారులను ఆదేశించారు. ప్రధాని ప్రారంభించే మియాపూర్ మెట్రో పైలాన్ నిర్మాణ పనులను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్ల వివరాలను డీజీపీ మహేందర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
Tag : Travel by ministers and MLAs on the Metro train


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *