టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల విచారణ.

-మార్చి 11 కు వాయిదా
తిరుపతి   ముచ్చట్లు:
టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై హైకోర్టులో ఈరోజు విచారణ కొనసాగింది. బీజేపీ నాయకుడు భానుప్రకాశ్‌తో తోపాటుదాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో ఇచ్చిన జీవోలపైన కోర్టులో కేసు జరుగుతుండగా అదే అంశంపై ఆర్డినెన్స్‌ ఎలా తీసుకొస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది . ప్రత్యేక ఆహ్వానితుల విషయంపై హైకోర్టు గతంలో స్టే ఇచ్చిందన్న పిటిషనర్‌ తరుఫున న్యాయవాది వాదించగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించబోమని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. దీంతో ఇరు వాదనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం విచారణ మార్చి 11 వరకు వాయిదా వేసింది. గతంలో టీటీడీకి బోర్డు మెంబర్లతో పాటు మరో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఆర్డినెన్సును జీవను తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్సును సవాలు చేస్తూ ఇద్దరు పిటిషన్లు దాఖలు చేశారు. ప్రత్యేక ఆహ్వానితుల్లో నేర చరితులున్నారని , పెద్ద సంఖ్యలో ఆహ్వానితులను నియమించడం సరికాదంటూ పిటిషన్లో పేర్కొన్నారు.
 
Tags:Trial of special invitees on TTD board

Natyam ad