Tribal and tribal students' fees reimbursement worth crores of rupees

హరిజన, గిరిజన విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్‌ పేరుతో కోట్లాది రూపాయలు స్వాహా

– విద్యార్థుల చేతి గుర్తులకు డబ్బే…
– కళాశాలల్లో కనిపించని అక్రమాలు
– కోట్లాది రూపాయలు స్వాహా
– ఆర్టీఐ క్రింద కోరినా అందని సమాచారం
– కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలి డిమాండు

Date:26/01/2018

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో ప్రవేశపెట్టిన హరిజన, గిరిజన విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్‌ పథకం ప్రవే టు కళాశాలలకు కాసుల వర్షం కురిపిస్తోంది. విద్యార్థులు కళాశాలలకు హాజరుకాకపోయినా, పరీక్షలు రాయకపోయినా వారి చేతి గుర్తులకు వేలాది రూపాయలు ముట్టజెప్పి, లక్షలాది రూపాయలు కళాశాల యజమాన్యాలు స్వాహా చేస్తున్న వైనం చిత్తూరు జిల్లాలో వెలుగుచూస్తోంది. వివరాల్లోకి వెళ్లితే చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాలలోను అన్నిరకాల కళాశాలలు 171 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీ , బీసీ, ఈబీసీ విద్యార్థులు కలసి వెహోత్తం: 22,

జిల్లాలో వెహోత్తం డిగ్రీ కళాశాలలు: 171,
వెహోత్తం విద్యార్థులు : 18,199 మంది.
విడుదలైన వెహోత్తం నిధులు: రూ.29.18 కోట్లు.
ఒకొక్క విద్యార్థికి రూ. 17 వేల నుంచి రూ.21 వేల వరకు

ఈ విధంగా ప్రభుత్వం ఒకొక్కరికి ఫీజు రీయంబర్స్మెంట్‌ నిధులు విడుదల చేస్తుంది. ఈ నిధులతో పాటు ఉపకార వేతనాలను అందజేస్తుంది. ఈ విధంగా ఒకొక్క విద్యార్థికి ప్రతి యేటా రూ.17 వేల నుంచి రూ.21 వేల రూపాయలు జమ చేస్తుంది. దీనితో పాటు ఉపకార వేతనాలకు సంబంధించి రూ.4 వేలు మాత్రం విద్యార్థి బ్యాంకు ఖాతాకు నేరుగా జమ చేస్తారు. మిగిలిన ఫీజు వెహోత్తం రూ.21 వేల వరకు కళాశాల యాజమాన్యం ఖాతాకు జమ చేస్తారు. ఈ విధంగా ఒకొక్క కళాశాలలో ప్రతియేటా రూ.15 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఒకొక్క కళాశాల యాజమాన్యం ఖాతాకు ప్రభుత్వం నిధులు బదిలీ చేస్తుంది. ఈ డబ్బును విద్యార్థుల తరపున కళాశాల యాజమాన్యం వినియోగించుకుంటుంది. విద్యార్థుల వద్ద నుంచి ఏ డబ్బులు వసూలు చేయరాదనేది నిబంధన. ఈ మేరకు విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఉచిత విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయం.

విద్యార్థులు లేకున్నా నమోదు జాబితా….

జిల్లాలోని కొన్ని కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య లేకపోయినా , చదువు ఆపివేసిన విద్యార్థులను , ప్రక్క జిల్లాలో ఉన్న విద్యార్థులను నమోదు చేసుకుని , జాబితాలను సంబంధిత కార్పోరేషన్లకు పంపుతున్నారు. ఈ విధంగా లక్షలాది రూపాయలు స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే కళాశాలలో నమోదు కాబడి , చదువు ఆపివేసిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేస్తూ, మిగిలిన ఫీజు రీయంబర్స్మెంట్‌ను విద్యార్థి పేరుతో కళాశాల యాజమాన్యం స్వాహా చేస్తోంది. చదువుతున్న విద్యార్థుల వద్ద పుస్తకాలు, పరీక్షల ఫీజులు, రికార్డు ఫీజుల పేరుతో యాజమాన్యం ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు కొంత మంది విద్యార్థులు సమాచార హక్కు క్రింద కళాశాలలను కోరారు. కానీ కళాశాల యాజమాన్యాలు స్పందించకపోవడంతో నిధులు స్వాహా జరిగిందనటానికి ఉతంమిస్తోంది.

అటెండెన్స్తో బయోమెట్రిక్‌ అనుసంధానం చేయాలి …

జిల్లాల్లోని కొన్నికళాశాలలో జరుగుతున్న అక్రమాలను నియంత్రించేందుకు , బోగస్‌ జాబితాలను అరికట్టేందుకు విద్యార్థుల అటెండెన్స్తో బయోమెట్రిక్‌ను అనుసంధానం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇలా లేని కారణంగా యాజమాన్యాలు చదువు ఆపివేసిన విద్యార్థుల ఇంటికి వెళ్లి బయోమెట్రిక్‌ తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తున్నారు.

Tags : Tribal and tribal students’ fees reimbursement worth crores of rupees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *