గిరిజన భూముల్లో గిరిజనేతరుల రాజ్యం

ఖమ్మం ముచ్చట్లు:

అడవుల జిల్లా ఖమ్మం పరిధి కుక్కునూరు మండలంలో గిరిజనులే జీవిస్తుంటారు. గిరిజనుల కోసం ప్రభుత్వం, 2005 ముందు వరకు పోడు చేసుకున్న భూములకు పట్టాలివ్వడం జరిగింది. కానీ ఇక్కడ గిరిజనేతరుల రాజ్యం నడుస్తోంది. ఈ భూమిలో వాళ్లు వ్యవసాయానికి బదులు, వ్యాపారం చేస్తున్నారు. అమాయక గిరిజనులకు డబ్బును ఎరవేసి, వాళ్ల పొట్టలు కొడుతున్నారు. రెవెన్యూ అధికారులు గానీ, విద్యుత్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు గానీ పోడు చేసుకున్న భూములలో జామాయిల్‌ వేసినా పట్టించుకోవడం లేదు. జామాయిల్‌ క్లోన్స్‌ను మెయింటెయిన్‌ చేయాలంటే విపరీతంగా నీరు కావాల్సి ఉంటుంది. అసలు జామాయిల్‌ క్లోన్స్‌ పెట్టాలంటే ముందుగా, స్థానిక ఎంఆర్‌ఓ, ఆర్‌డిఓ ఎలక్ట్రికల్‌ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. ఇక్కడ ఆ రూల్స్‌ ఎవ్వరూ పాటించడం లేదు. పైగా అధికారులు మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్రస్థాయి అధికారులు చొరవ తీసుకొని భూములను తమకు ఇప్పించి, భూగర్భ జలాలను కాపాడాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు. ముడుపులు తీసుకొని అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tag : Tribal land of tribal lands


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *