టిటిడి విశ్రాంత ఉద్యోగులకు ఘనంగా సన్మానం

Date : 17/12/2017
తిరుపతి ముచ్చట్లు:
రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 123 మంది టిటిడి విశ్రాంత ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. టిటిడి విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది.సన్మాన గ్రహీతల్లో ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ కృష్ణస్వామి, మొదటి మహిళా డెప్యూటీ ఈవో శ్రీమతి పురాణం సావిత్రి, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి డా|| డిఎం.ప్రేమావతి, వైద్య విభాగానికి వన్నె తెచ్చిన డా|| వేణుగోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఉన్నతాధికారుల స్థాయి నుంచి కింది స్థాయి సెక్యూరిటీ గార్డుల వరకు అందరినీ ఈ సందర్భంగా జ్ఞాపిక, శాలువ, శ్రీవారి ప్రసాదంతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో టిటిడి విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ రెడ్డివారి ప్రభాకర్‌రెడ్డి, సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ, రిటైర్డ్‌ డెప్యూటీ ఈవో శ్రీ చిన్నంగారి రమణ ఇతర విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.
Tags : Tribute is a great honor for retired employees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *