అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా కానిస్టేబుల్స్ కు  సన్మానం..

తుగ్గలి ముచ్చట్లు:
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా తుగ్గలి పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న మహిళ కానిస్టేబుల్స్ ఆదిలక్ష్మి,సుశీల కు మంగళవారం రోజున స్థానిక తుగ్గలి పోలీస్ స్టేషన్ నందు తుగ్గలి ఎస్ఐ షామీర్ భాష ఘనంగా సన్మానించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు మగవారితో పోటీగా రాణిస్తున్నారని, ఎంతోమంది మహిళలు ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఆయన తెలియజేశారు.నేటి సమాజంలో మహిళలు ఆర్థికంగా,సామాజికంగా ఎదుగుతూ చైతన్యవంతులుగా సేవలు అందిస్తున్నారని ఎస్.ఐ తెలియజేశారు. స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది వీర మహిళలు వీర మరణం పొందిన స్వాతంత్రం కూడా తీసుకువచ్చారని ఆయన తెలియజేశారు.సమాజంలోని మహిళలకు మంచి గౌరవం అందించి,మహిళల అభ్యున్నతి కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తుగ్గలి ఎస్.ఐ షామీర్ భాష తెలియజేస్తూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నరసప్ప,కానిస్టేబుల్ వినోద్ మరియు తుగ్గలి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొని మహిళా కానిస్టేబుల్స్ కు శుభాకాంక్షలను తెలియజేశారు.
 
Tags:Tribute to Women Constables on International Women’s Day

Natyam ad