పుంగనూరులో దివంగత ముఖ్యమంత్రి రాజన్న విగ్రహానికి నివాళులు

పుంగనూరు ముచ్చట్లు:

జగనన్న చేదోడు పథకం క్రింద లబ్దిపొందిన టైలర్లు కలసి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలామాలలు వేసి నివాళులర్పించారు. మంగళవారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి టైలర్ల ఖాతాల్లోకి రూ.10 వేలు జమ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ కిజర్‌ఖాన్‌ ఆధ్వర్యంలో టైలర్లు కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరిపారు. ముఖ్యమంత్రి , మంత్రి పెద్దిరెడ్డి , ఎంపీ మిధున్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో టైలర్లు చంద్ర, ఖాసీం, నరసింహులు, అస్లాం , సూరితో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు ఇంతియాజ్‌, కిషోర్‌, రాజా పాల్గొన్నారు.
 
Tags; Tributes to the statue of the late Chief Minister Rajanna in Punganur

Natyam ad