Triple Thalaq is unconstitutional

ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ విరుద్ధం

– పాఫులర్‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా

Date : 01/01/2018

పుంగనూరు ముచ్చట్లు:

భారతదేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ట్రిపుల్‌తలాక్‌ బిల్లును ప్రవేశపెట్టారని పాఫులర్‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా ఆరోపించింది. పార్టీ అధ్యక్షుడు ఫయాజ్‌, అతిక్‌బాషా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రిపుల్‌తలాక్‌ బిల్లును ముస్లిం పర్శనల్‌ లాబోర్డులో చేర్చడం రాజ్యాంగ విరుద్దమన్నారు. ముస్లిం మహిళల అభిప్రాయం స్వీకరించకుండ , ముస్లింల హక్కులకు భంగం కలిగించడం బాధకరమన్నారు. ఈ విషయమై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ముస్లిం పర్శనల్‌ లాబోర్డులో జోక్యం చేసుకోవడం ముస్లింల ప్రాధమిక హక్కులను హరించడమేనన్నారు.

Tags : Triple Thalaq is unconstitutional

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *