పాలమూరు లో టీఆర్ ఎస్వీ ,ఆధ్వర్యంలో అంబరాన్ని అంటిన విద్యార్థుల సంబరాలు.

-సీఎం కేసీఆర్ ,మంత్రి శ్రీనివాస్ గౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన విద్యార్థి నాయకులు
-సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపిన టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు సుదీప్ రెడ్డి
మహబూబ్ నగర్ ముచ్చట్లు:
తెలంగాణ చరిత్రలో ఈరోజు ఒక ఒక సుదినం అని ఈ రోజు తప్పకుండా చరిత్రలో నిలిచిపోతుందని టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర నేత సుదీప్ రెడ్డి అన్నారు. దాదాపు 80 వేల పైచిలుకు ఉద్యోగాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వడం చరిత్రలో ఇప్పటివరకు ఎక్కడా చూడలేదని ఆయన అన్నారు. నిరుద్యోగులకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ లకు ఆయన అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు.
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా విద్యార్థుల పక్షాన యావత్ తెలంగాణ విద్యార్థి లోకం పక్షాన మన్య శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు
ఈరోజు అసెంబ్లీలో సీఎం కేసీఆర్  కీలక ప్రకటన రాష్ట్రంలో 11,103 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్, తక్షణమే 80,039 ఉద్యోగాల నోటిఫికేషన్ పై స్పష్టత తెలియజేసిన సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేశారు
న్యూ టౌన్  పార్టీ కార్యాలయం నుండి తెలంగాణ చౌరస్తా  వరకు  భారీ ర్యాలీ గా వెళ్లి  టపాకాయలు  పేల్చి  స్వీట్స్  పంచుకొని  సంబరాలు  జరుపుకున్నారు . ఈ కార్యక్రమం లో విద్యార్ధి  మరియు  ప్రవేట్  ఉద్యోగుల అధ్యక్షులు   శివకుమార్ ,గణేష్  ,పవన్  వినయ్ ,శ్రీకాంత్  ,బాలు ,భాను  ,కాలనీ గణేష్  తో  పాటు  విద్యార్థులు  పెద్ద ఎత్తున పాల్గొని హర్షం వ్యక్తం చేసారు.
 
Tags:TRSV in Palamuru, under the auspices of the students celebrating the amber

Natyam ad