తిరుమ‌ల‌లో విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌పై టిటిడి ఈవో స‌మీక్ష‌

తిరుమ‌ల‌ ముచ్చట్లు:
 
తిరుమ‌ల‌లో విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌పై టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో పలు సమీక్షా సమావేశాలు నిర్వహించారు.అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ అద‌న‌పు ఈవో అధ్యక్షతన విప‌త్తుల‌ను ఎదుర్కోనేందుకు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. భారీ వ‌ర్షాలు, పిడుగులు, అగ్ని ప్ర‌మాదాలు, వేస‌విలో వ‌డ‌గాలులు, వ‌ర‌ద‌లు, కొండ చ‌రియ‌లు విరిట‌గిప‌డ‌టం, తొక్కిస‌లాట‌, రోడ్డు ప్ర‌మాదాలు, భ‌ద్ర‌త ప‌ర‌మైన స‌మ‌స్య‌లు సంభ‌వించిన‌ప్పుడు సంబంధిత శాఖ‌లు ఏవిధ‌మైన నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌ల‌నే విష‌యంపై ఏర్పాటు చేసిన క‌మిటీ ఈ నెలాఖ‌రులోగా కార్య‌చ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు రూపొందించి నివేదిక స‌మ‌ర్పించ‌నున్న‌ట్లు తెలిపారు.”యాత్రికుల రద్దీని క్రమబద్ధీకరించడానికి ప‌టిష్ట‌మైన భద్రతా వ్యవస్థను కలిగి ఉన్నామ‌న్నారు. కానీ అధిక నష్టాన్ని నివారించడానికి, ప్రకృతి నుండి ఎదురయ్యే సవాళ్లను సాధ్యమైనంత వరకు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి” అని ఆయన చెప్పారు.
 
 
తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం అమలుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తిరుమ‌ల‌లోని అన్ని వాణిజ్య దుకాణాలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, కవర్ల విక్రయాలను నిలిపివేసి వాటి స్థానంలో బయో డిగ్రేడబుల్ బ్యాగులు, గాజు సీసాలు అందుబాటులో ఉంచిన్నట్లు తెలిపారు.గత నవంబర్‌లో సంభవించిన వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న శ్రీవారి మెట్టు మార్గంను ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు నాటికి పునరుద్ధరిస్తామని ఈవో తెలిపారు.జెఈవో  సదా భార్గవి (వర్చువల్‌గా), ఎఫ్ఎసిఎవో బాలాజీ, సిఇ శ్రీ నాగేశ్వరరావు, డిఎల్‌వో  రెడ్డెప్ప రెడ్డి, సిఎవో  శేష శైలేంద్ర, ఆరోగ్య విభాగం అధికారిణి డాక్టర్ శ్రీదేవి, డిఎఫ్‌వో ఇంచార్జ్‌  ప్రశాంతి, డెప్యూటీ ఈవోలు  హరీంద్రనాథ్,  లోకనాథం,  భాస్కర్, వీజీవో  బాలిరెడ్డి తదితరులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.
 
Tags: TTD Evo Review on Disaster Management in Tirumala

Natyam ad