Tugi 'friedies' from 13 for lunch lovers

భోజన ప్రియుల కోసం 13 నుండి టీజీఐ ‘ఫ్రైడేస్’

Date: 13/01/2018

-వారాంతపు రోజుల్లో ఆకట్టుకునేలా ప్రత్యేక భోజనం

హైదరాబాద్ ముచ్చట్లు:

ఆహరం, వినోద రంగాలలో ప్రముఖ సంస్థ అయిన టీజీఐ ఫ్రైడేస్ హైదరాబాద్‌లో భోజన ప్రియుల కోసం ప్రత్యేకమైన మేనును అమలు చేయాలని నిర్ణయించింది. వారాంతపు రోజులైనా శని, ఆదివారాల్లో భోజన ప్రియుల కోసం ఈనెల 13వ తేదీ నుంచి దేశంలో గల 13 హోటల్స్‌లలో ఈ భోజన కార్యక్రమం అమలు చేస్తామని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. మద్యం, శీతల పానీయాలతో పాటు పసందైన భోజనం మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు అందుబాటులో ఉంచుతుంది. ఈ ప్రత్యేక విందుకు ‘హాంగోవర్ బ్రెంచ్’ అని పేరు పెట్టింది. స్వదేశీ, విదేశీ, మద్యంతో ఉండే ఈ విందుకు ధరలను రెండు రకాలుగా నిర్ణయించారు. బ్రెంచ్ కాంబో 1695 రూపాయల ధరలో స్వదేశీ మద్యం, ఆహరం అందిస్తారు. 3495 రూపాయల బ్రెంచ్ కాంబోలో విదేశీ మద్యం, ఆహరం అందజేయనున్నారు. హైదరాబాద్‌లో బంజారాహిల్స్, కూకట్‌పల్లిలోని తమ రెండు రెస్టారెంట్‌లలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని సంస్థ తెలిపింది.

Tags: Tugi ‘friedies’ from 13 for lunch lovers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *