బోరు బండి బోల్తా, ఇద్దరు మృతి

మాడుగులముచ్చట్లు:
మాడుగుల మండలం ఇర్విన్ గ్రామ సమీపంలో గురువారం బోరుబండి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. బోరుబండి ఇర్విన్ గ్రామం నుంచి ఆమనగల్లు వైపు వెళుతుండగా అదుపుతప్పి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
Tag: Two boats were killed and two killed


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *