ఇద్దరు పిల్లలు అనుమాస్పద మృతి

శ్రీకాళహస్తి ముచ్చట్లు:
శ్రీకాళహస్తి రాచగున్నెరి వద్ద అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు మృతి చెందారు.చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఫ్యాక్టరీలో కార్మికుల గా పనిచేసే బెంగాల్ కు చెందిన రామదాస్, నీలం దేవి దంపతులు.రాచగున్నెరి వద్ద ఓ ప్రయివేటు ఫ్యాక్టరీ లో కార్మికులు గా పని చేస్తున్నారు.వీరికి ఇద్దరు పిల్లలు మొదట పాప హేనకుమారి 6 సం. బాబు 2 సం.రాత్రి టిఫిన్ చేసి పడుకున్నారు.ఉదయం సుమారు మూడు గంటల ప్రాంతంలో పిల్లలు కదిలిక లేకపోవడంతో హుటాహుటిన శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ కు తీసుకుని వెళ్లారు.డాక్టర్లు పిల్లలు ఇద్దరు అప్పటికే మృతి చెందారు అని డాక్టర్లు నిర్థారించారు.కానీ తల్లిదండ్రులు, డాక్టర్లు పిల్లలు ఎలా చనిపోయినారు ,ఎందుకు చనిపోయారు అనే విషయాన్ని చెప్పలేక పోతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నపిల్లలు మరణించిన ఏరియా హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు చనిపోవటం ఏరియా హాస్పిటల్ సిబ్బంది సైతం మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇచ్చి మృతదేహాలను తల్లిదండ్రులకు అప్పగించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది..
 
Tags:Two children died untimely

Natyam ad