భారీ ట్రక్కు ఢీకొని ఇద్దరు చిన్నారులు మృతి

Date: 09/01/2018

తిరువనంతపురం ముచ్చట్లు :

కేరళలోని మలప్పురం జిల్లాలోని మనిమూలీ ప్రాంతంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. పాఠశాల బస్సు కోసం వేచి చూస్తున్న విద్యార్థులపై ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థులను ఫిదా, మహ్మద్‌గా గుర్తించారు. వీరిద్దరూ మనిమూలిలోని సీకేహెచ్‌ఎస్‌లో చదువుతున్నారు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. విద్యార్థులపైకి దూసుకెళ్లే కంటే ముందే ట్రక్కు..
ఆటో, బస్సు, బైక్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags : Two children were killed when a huge truck collided

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *