ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్..

-కొంపముంచిన వసూళ్ల వాటా వివాదం
 
ఎమ్మిగనూర్ ముచ్చట్లు:
 
ఎమ్మిగనూరు  పట్టణం లోఆ ఇద్దరు పోలీసుల పేరు ఘనమే. పాపం పండింది. అసలుకు ఎసరొచ్చింది. చివరకు ఇద్దరు సస్పెండ్ కు గురైన సంఘటన పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. ఎమ్మిగనూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా ఆదిశేషి రెడ్డి, క్రైం బ్రాంచ్ కానిస్టేబుల్ గా అంజినయ్య విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఎమ్మిగనూరు పట్టణంలో శ్రీనీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఎద్దుల పోటీలు నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ బందోబస్తు నిమిత్తం హెడ్ కానిస్టేబుల్ ఆదిశేషి రెడ్డి ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎద్దుల పోటీల నిర్వహకులను ఆదిశేషిరెడ్డి డబ్బులు అడగ్గా, వారు  ఫోన్ పే ద్వారా డబ్బులు పంపినట్లు సమాచారం. అయితే ఈ విషయం క్రైం బ్రాంచ్ కానిస్టేబుల్ అంజినయ్య కు తెలియడంతో హెడ్ కానిస్టేబుల్ ఆదిశేషి రెడ్డి ని ప్రశ్నించారు. వాట కోసం వాదించాడు. హెడ్ కానిస్టేబుల్ నా ఫోన్ పే లో ఇంకా డబ్బులు జమ కాలేదు అని సమాధానం చెప్పాడు. దాంతో మాటకు మాట పెరిగి వారిద్దరి మధ్య వాగ్వివాదానికి దారితీసింది.  కొంత మంది పోలీసు సిబ్బంది ఆ ఇద్దరు మధ్య జరిగిన  వాగ్వివాదం విడియో ను కాస్త జిల్లా ఎస్పీ కి పంపినట్లు సమాచారం. స్పందించిన జిల్లా ఎస్పీ ఆదోని డిఎస్పీ కి విచారణ నిమిత్తం ఆదేశాలు జారీ చేశారు. దీంతో డిఎస్పీ డబ్బులు పంపిన వ్యక్తి ని పిలిచి విచారించారు. ఫోన్ పే లో నగదు ఇచ్చామని తేలింది. వాటితోపాటు వాటాల దందా బట్టబయలైయింది. డిఎస్పీ ఇద్దరు కానిస్టేబుళ్లు పై జరిగిన సంఘటన పై జిల్లా ఎస్పీ కి విచారణ నివేదిక పంపడం జరిగింది. దీంతో ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మరో కొంతమంది ఆవినీతి పోలీసు సిబ్బంది గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags; Two constables suspended.

Natyam ad