లారీ ఢీకొని ఇద్దరు మృతి: 8 మందికి గాయాలు

Date: 03/01/2018

భద్రాద్రి ముచ్చట్లు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం మండలం భీమునిగుండం కొత్తూరు గ్రామం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో 8 మందికి గాయాలయ్యాయి. బీఎస్ఎన్ఎల్ కేబుల్ వైర్లు అన్ లోడ్ చేస్తుండగా లారీ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతిచెందారు. కాగా… గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారమందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకున్నారు.

Tag: Two dead, 8 injured in lorry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *