హైకోర్టు పరిసరాల్లో రెండునెలల పాటు ఆంక్షలు

హైదరాబాద్ ముచ్చట్లు:

హైకోర్టు పరిసరాల్లో రెండు నెలల పాటు అంక్షలు విధి స్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ, ఏపీ హైకోర్టుల ప్రధాన కార్యకలాపాలతో పాటు అడ్వకేట్లు, కోర్టు పనుల పై వచ్చే సాధారణ ప్రజానీకానికి ఇబ్బంది కలిగించే విధంగా పరిసర ప్రాంతాల్లో పలు అంక్షలు విధించారు. ప్రధానంగా…ప్రాంతాలు హైకోర్టుకు ఉత్తర దిశలో సిటీ కాలేజీ జంక్షన్ నుంచి నయాపుల్ రోడ్ వరకుదక్షిణ దిశలో మదీనా బిల్డింగ్ నుంచి సిటీ కాలేజీ వరకు (మధ్యలో ఉన్న ఘాంసీబజార్, పటేల్ మార్కెట్, రికాబ్‌గంజ్ వీదులతో సహా)నయాపుల్, మదీనా సర్కిల్, హైకోర్టు రోడ్డు వరకు పత్తర్‌గట్టి, మదీనా హైకోర్టు రోడ్డువరకుముస్లింజంగ్ బ్రిడ్జి సర్కిల్ నుంచి హైకోర్టు రోడ్డు వరకు పురానాపుల్ పీటీవో నుంచి సిటీకాలేజీ క్రాస్‌రోడ్స్, హైకోర్టు వరకుమూసాబౌలి, మెహంది, సిటీ కాలేజీ క్రాస్‌రోడ్స్, హైకోర్టు రోడ్ వరకు ఉన్న రోడ్లతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న వీధుల్లో వాటి పరిసరాల్లో అంక్షలు అమల్లో ఉంటాయి. ఆంక్షలుఎలాంటి పబ్లిక్ మీటింగులు నిర్వహించరాదు. ఐదుగురు అంతకన్నా ఎక్కువ మంది గుమిగూడ రాదు.ఎలాంటి ఆయుధాలు, బ్యానర్లు, ప్లకార్డులు, లాఠీలు, ఇతర హాని కలిగించే వస్తువులు ఏవీ తీసుకుని వెళ్లరాదు.స్పీచ్‌లు, స్లోగన్లు ఇవ్వరాదు.ఎలాంటి ర్యాలీలు, యాత్రలకు అనుమతి ఉండదు.ధర్నాలు నిరసన కార్యక్రమాలకు కూడా అనుమతి లేదు.ఒకవేళ మత పరమైన కార్యక్రమాలు ఇతర ఫంక్షన్లు ఉంటే తప్పని సరిగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పోలీస్ కమిషనర్ వివరించారు. ఈ అంక్షలు ఈ నెల 20నుంచి వచ్చే ఏడాది జనవరి 18వరకు అమల్లో ఉంటాయి.

Tag : Two-month, restrictions ,in the High Court ,neighborhood.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *