ఇద్దరు ఎర్ర స్మగ్లర్లు ఆరెస్టు

Date:14/03/2018
తిరుపతి  ముచ్చట్లు:
రోజువారీ తనిఖీల్లో భాగంగా శ్రీవారి మెట్టు నుంచి కల్యాణి డ్యామ్ వెనుక వైపుగా కూంబింగ్ నిర్వహిస్తున్న  టాస్క్ పోర్స్ అధికారులు   రాగిమకుల కుంట ప్రాంతంలో స్మగ్లర్ల ఉనికిని గమనించారు.  దాంతో  రెండు బృందాలుగా విడిపోయి కూంబింగ్ కొనసాగించారు.  ఈ నేపథ్యంలో తిరుపతి డివిజన్ భీమవరం బీట్ కొటాల అటవీ ప్రాంతంలో 10 మంది స్మగ్లర్లును గుర్తించారు.  వీరిని పట్టుకునేందుకు ప్రయత్నించగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది పై దాడికి ప్రయత్నించారు.  అప్రమత్తంగా వ్యవహరించిన సిబ్బంది ఒక వైపు వారిని నిలవరిస్తునే మరో వైపు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆర్ఐ చంద్రశేఖర్ మరో బృందాన్ని సంఘటన స్థలానికి తరలించారు.  ఈ మధ్య సమయంలో స్మగ్లర్లు తప్పించుకునేందుకు సిబ్బంది పైకి ఎర్రచందనం దుంగలను విసిరేసి పారిపోయారు.  ఈ క్రమంలో ఇద్దరు స్మగ్లర్లు, కృష్ణగిరి జిల్లా కొంబంబట్టు కు చెందిన సత్యవేలు,  బాబు ను పోలీసులు పట్టుకున్నారు.  వీరి నుంచి ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.  పారిపోయిన వారి కోసం బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నారు. చిమ్మచికటి,  వాలుగా ఉన్న కొండపై స్మగ్లర్లు ను చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందిని ఐజి కాంతారావు,   గారు,  ఎస్పీ రవిశంకర్ అభినందించారు.
Tags; Two Red Smugglers are Arrested

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *