Uma Madhavareddy who is in the TRS

టీఆర్ఎస్లో చేరనున్న ఉమా మాధవరెడ్డి

Date : 12/12/2017
హైదరాబాద్ ముచ్చట్లు:
టీడీపీ సీనియర్ మహిళా నేత, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి తెరాసలో చేరనున్నారు. ఆమెతో పాటు ఆమె కుమారుడు, భువనగిరి జిల్లా తెదేపా అధ్యక్షుడు సందీప్రెడ్డి సైతం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారుఈ మేరకు మంగళవారం ఉదయం ఉమామాధవరెడ్డి, సందీప్రెడ్డి సీఎం కేసీఆర్ను ఆయన అధికారిక నివాసంలో కలిశారు. జిల్లా రాజకీయాలపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధిలో తాము భాగస్వాములవుతామని, సీఎం నాయకత్వంలో పనిచేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈనెల 14న మధ్యాహ్నం 12గంటలకు తెలంగాణ భవన్లో ఉమా మాధవరెడ్డి, సందీప్రెడ్డి వారి అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరనున్నారు.
Tags : Uma Madhavareddy who is in the TRS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *