Union Minister Rajnath Singh gave a clarity on the citizenship bill

పౌర‌స‌త్వ బిల్లుపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

Date:09/01/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
పౌర‌స‌త్వ బిల్లుపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ రాజ్య‌స‌భ‌లో మ‌ళ్లీ క్లారిటీ ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం శాంతిభ‌ద్ర‌త‌లు అదుపులో ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. పౌర‌స‌త్వ బిల్లుకు వ్య‌తిరేకంగా అస్సాం, మేఘాల‌యాతో పాటు ఇత‌ర రాష్ట్రాల్లో విధ్వంసం చెల‌రేగింది. ఈశాన్య రాష్ట్రాల సంక్షేమం, భ‌ద్ర‌త కోసం కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని రాజ్‌నాథ్ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల స‌రిహ‌ద్దు వ‌ద్ద భ‌ద్ర‌త‌ను పెంచేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్లు చెప్పారు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లుపై అనేక త‌ప్పుడు ప్ర‌చారాలు జ‌రిగిన‌ట్లు ఆయ‌న తెలిపారు. పాకిస్థాన్‌, ఆఫ్ఘ‌నిస్తాన్‌, బంగ్లాదేశ్‌లో మైనార్టీలుగా ఉన్న వారికి పౌర‌స‌త్వం ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లు కేవలం అస్సాంకు చెందిన‌ది కాదు అని, యావ‌త్ దేశానికి సంబంధించిన‌ద‌ని, అస్సాంలో ఎన్నో ఏళ్లుగా అక్ర‌మ వ‌ల‌స‌దారుల స‌మ‌స్య ఉంద‌న్నారు. అస్సాం ప్ర‌జ‌ల సాంప్ర‌దాయాల‌ను, మ‌నోభావాల‌ను గౌర‌విస్తామ‌ని, ఆ రాష్ట్రానికి చెందిన ఆరు తెగ‌ల‌ను ఎస్టీల్లో చేర్చుతామ‌న్నారు.
Tags:Union Minister Rajnath Singh gave a clarity on the citizenship bill

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *