ఏపీకి కేంద్ర మంత్రులు క్యూ…

విజయవాడ   ముచ్చట్లు:
 
కేంద్ర కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అలా వెళ్లారు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇలా ఏపీలో అడుగు పెట్టారు. ఒక రోజు పర్యటనకు ఆమె రాష్ట్రానికి వచ్చారు. అనంతపూర్ జిల్లా లోని గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసిన్ అకాడమి భూమి పూజ కార్యక్రమమలో ఆమె పాల్గొంటారు.  ఈ ఇద్దరే కాదు, గత కొంత కాలంగా కేంద్ర మంత్రులు క్యూ’కట్టి ఏపీకి వస్తున్నారు. వచ్చిపోవడమే కాదు,వరాలు కురిపిస్తున్నారు. పాలసముద్రం సమీపంలో  ఈరోజు నిర్మలమ్మ భూమి పూజ చేస్తున్న నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు & నార్కోటిక్స్ (నాసిన్) విషయాన్నే తీసుకుంటే, ఇది మాములు అకాడమీ కాదు, నేషనల్ అకాడమీ. అంతే కాదు, రూ.730 కోట్ల వ్యంతో నిర్మిస్తున్న నాసిన్’ కేంద్రం దక్షిణాదిలో రెండో అతిపెద్ద శిక్షణ కేంద్రం. ఐఆర్‌ఎస్‌లకు (ఇండియన రెవెన్యూ సర్వీసెస్‌) ప్రొబెషనరీలో భాగంగా ఇక్కడ శిక్షణ నిర్వహించనున్నారు. అన్నిటినీ మించి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలో భాగంగా 2014లో మంజురైన అకాడమీకి ఇప్పుడు భూమి పూజ చేస్తున్నారు. అలాగే, తాజాగా పోలవరంలో పర్యటించిన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ రాష్ట్ర విభజన చట్టంలో చెప్పిన ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి పనినీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ప్రాజెక్టును పూర్తిచేస్తాయని.. కానీ ఆర్ధిక భారమంతా కేంద్రమే భరిస్తుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఏ అవసరం వచ్చినా సహకరిస్తామని.. ఇది ప్రధాని మోదీ మాటగా చెబుతున్నానని షెకావత్‌ తెలిపారు.అంతేకాదు పునరావాసం విషయంలోనూ కేంద్ర మంత్రి స్వరంలో మార్పు వచ్చింది. ఇంతవరకు, పునరావాసం విషయంలో  కేంద్రం  కొర్రీలు పెడుతూ వచ్చిన విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు కేంద్ర మంత్రి షెకావత్  పోలవరం నిర్వాశితుల కాలనీలలో సందర్శించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో అనేక ఏళ్లుగా జీవించి, ఆ ప్రాంతంతో మమేకమైన ప్రజలను ఆ ఊరి నుంచి పునరావాస కాలనీలకు తీసుకొచ్చేసి మన పని అయిపోయిందనుకోవడం సరికాదు. వాళ్ల ఇబ్బందులు తెలుసుకోవాలి. చిన్నపిల్లలను చూసినట్లు చూడాలి, అటూ కొత్త స్వరం వినిపించారు.మళ్ళీ వచ్చి మరిన్ని కాలనీలు సందర్శిస్తానని మాటిచ్చారు. ముంపు బాధితులందరికీ ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీ టీ) పథకం ద్వారా పరిహారం అందించాలన్నారు.నిజానికి, గతంలోనూ కేంద్ర ప్రభుత్వం హామీలు ఇచ్చింది, కానీ, అవి ఆచరణలోకి రాలేదు, కానీ, ఈ సారి కేంద్ర మంత్రి ఇచ్చిన హామీలు ఎందుకో అమలవుతాయనిపిస్తోందని, అధికార వర్గాలు అంటున్నాయి. నిజానికి, షెకావత్ కంటే ముందు, జనవరి (2022)లో ఏపీలో పర్యటించిన కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కూడా పోలవరం పూర్తి చేసి రైతుల కష్టాలు తీరుస్తామన్నారు. మరో వంక గడ్కరీ,తమ శాఖకు సంబంధించి అనేక వరాలు ప్రకటించారు, శంఖు స్థాపనాలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్’లో  31 జాతీయ రహదారుల ప్రాజెక్టులు, 20 రోడ్లు, ఇతర ప్రాజెక్టులను ముఖ్యమంత్రి  జగన రెడ్డి, మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి విజయవాడలో వర్చువల్‌గా ప్రారంభించారు. రోడ్ల అభివృద్ధికి రూ.3 లక్షల కోట్లు కేటాయిస్తామని గడ్కరీ అన్నారు. రాష్ట్రంలో 6 గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మిస్తున్నామన్నారు. 2024 లోగా రాయ్‌పుర్‌-విశాఖ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మిస్తాం. నాగ్‌పుర్‌-విజయవాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మిస్తాం. బెంగళూరు-చెన్నై మధ్య మరో గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మిస్తాం. రూ.5 వేల కోట్లతో చిత్తూరు-తంజావూర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే.పూర్తి చేస్తామని గుక్కతిప్పుకోకుండా నగడ్కరీ, వరాల జల్లులు కురిపించారు. కేంద్ర మంత్రులు కురిపించిన వరాలు అన్నీ, నిజం అవుతాయా, కార్యరూపం దలుస్తాయా అనే విషయం ఎలా ఉన్నా, కేంద్ర మంత్రుల వరస పర్యటనలు, వరాల జల్లులు రాజకీయంగా బీజేపీ ఏపీ మీద కన్నేసిందనేందుకు సంకేతమా అంటే, కాదనలేమని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి గత సంవత్సరం (2021) నవంబర్ ‘లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, తిరుపతి పర్యటన మొదలు ఏపీపై బీజేపీ ప్రత్యేక దృష్తి పెట్టిందని, ఇక ఇప్పుడు రానున్న రెండు సంవత్సరాలో పోలవరం పూర్తి చేయడంతో పాటుగా, మరి కొన్ని విభజన హమీలను అమలు చేయడం ద్వారా, రాష్ట్రంలో బీజేపీ పొలిటికల్ స్పేస్ పెంచుకునే ప్రయత్నం చేస్తోందని, పరిశీలకులు అంటున్నారు.అయితే, రాష్ట్రంలో ఇటు టీడీపీ, అటు వైసీపీ బలంగా ఉన్న నేపద్యంలో బీజేపీకి ఆశించిన ఫలితం దక్కుతుందా , అంటే అనుమానమే అంటున్నారు.
 
Tags:Union ministers queue for AP …

Natyam ad