యూపీ బుల్డోజర్లు.. తెలంగాణకూ వస్తాయ్: రాజాసింగ్ సంచలనం

హైదరాబాద్  ముచ్చట్లు:
గతంలో యూపీలో ఉండాలంటే యోగీ అనాల్సిందేనని.. బీజేపీకి ఓటేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్.. మరోసారి తన నోటికి పని చెప్పారు. బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయని.. యూపీ బుల్డోజర్లు తెలంగాణకు సైతం వస్తున్నాయని రాజసింగ్ పేర్కొన్నారు. నేడు రాజాసింగ్ మీడియా తో  మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ అవినీతి, కుటుంబ పాలనను బల్డోజర్లతో తొక్కిచ్చేస్తామన్నారు. డబ్బులు సంపాదన కోసమే దేశ వ్యాప్తంగా ఎంఐఎం పోటీ చేస్తోందన్నారు. ఎంఐఎంతో బీజేపీ దోస్తీ అనేది.. కేవలం ప్రచారం మాత్రమేనన్నారు. ఎంఐఎం‌ తమకు రాజకీయ శత్రువని.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణను గెలుస్తామన్నారు. యోగీ నాయకత్వాన్ని యూపీ ప్రజలు సమర్థించారని రాజసింగ్ తెలిపారు.
 
Tags:UP bulldozers come to Telangana: Rajasingh sensation

Natyam ad