ముక్కంటిని దర్శించుకున్న యూపిఎస్సీ సెక్రటరీ వసుధ మిశ్రా

శ్రీకాళహస్తి ముచ్చట్లు:
 
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ వసుధ మిశ్ర శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని గురువారం  దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్ది రాజు ఆదేశాల మేరకు ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల గర్భాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ మేధా దక్షిణామూర్తి సన్నిధి వద్ద దుశ్శాలువ తో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు.  ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, ఏ ఈ ఓ ధనపాల్, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ప్రోటోకాల్ సూపర్డెంట్. నాగభూషణం యాదవ్. ఆలయ తనిఖీ ల అదికారి విజయ సారధి, తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: UPSC Secretary Vasudha Mishra visited Muktani

Natyam ad