ఇవాంక రాక సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు

హైదరాబాద్ ముచ్చట్లు:
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్ ఇవాంక హైదరాబాద్ రాక సందర్భంగా నగరం కళకళలాడుతోంది. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ఈనెల 28, 29 తేదీల్లో నగరంలోని హెచ్ఐసీసీలో గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనేందుకు వైట్ హౌస్ సలహాదారు హోదాలు ఇవాంక ట్రంప్ హైదరాబాద్ రానున్న విషయం తెలిసిందే. అయితే ఆమె నగరంలో రాకపోకలు సాగిస్తున్న మార్గాలన్నింటిలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. హైటెక్ నుంచి హెచ్ఐససీ వెళ్లే మార్గమంతా అందంగా తీర్చి దిద్దారు. ఇవాంక రాకకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ….భాగ్యనగరంలో సందడి నెలకొంది. ఇవాంకతో పాటూ ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా పలువురు వ్యాపారవేత్తల సిద్ధమవుతున్నారు. సదస్సులో ఆహ్వానం పొందేందుకు ఎవరికి వారే ప్రయత్నాలు మమ్మురం చేస్తున్నారు.
Tag : US President,  Donald Trump Kumar Ewangka,  arrives in, Hyderabad


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *