పుంగనూరులో ఆర్‌బికె పనిముట్లను ఉపయోగించుకోవాలి – ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:
 
ప్రభుత్వం సచివాలయ పరిధిలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలకు కేటాయించిన వ్యవసాయ పనిముట్లను రైతులు వినియోగించుకోవాలని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం మండల రైతు సలహ కమిటి సమావేశాన్ని కమిటి అధ్యక్షుడు నరసింహులు, ఏడి లక్ష్మానాయక్‌ నిర్వహించారు. ఎంపీపీ , ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి హాజరైయ్యారు. ఎంపీపీ మాట్లాడుతూ ఆర్‌బికెలలో సిహెచ్‌సి గ్రూపులను ఏర్పాటు చేసి, అన్ని రకాల వ్యవసాయ పనిముట్లను కేటాయించడం జరిగిందన్నారు. రైతులు అతి తక్కువ అద్దెకు లభించే పనిముట్లను వినియోగించుకుని ఆర్‌బికెలను బలోపేతం చేయాలన్నారు. ఎరువులు, మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో లక్ష్మీపతి, ఏవో సంధ్య, హెచ్‌వో లక్ష్మీప్రసన్న, రైతులు రాజశేఖర్‌రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, ధనుంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
Tags: Use RBK tools in Punganur – MP Bhaskar Reddy

Natyam ad