డిజిటల్ బ్యాంక్ సేవలు వినియోగించుకోండి.

-గోపులాపూర్ లో అవగాహన కల్పించిన టిజిబి బిజినెస్ కరస్పాండెంట్.
జగిత్యాల  ముచ్చట్లు:
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అందజేస్తున్న డిజిటల్ బ్యాంక్ సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలని బిజినెస్ కరస్పాండెంట్ మిల్కూరి వసంత అన్నారు. గురువారం ఆమె జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామములో బ్యాంక్ ఖాతాదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బ్యాంక్ డిజిటల్ సేవలు, బ్యాంక్ ఇన్సూరెన్స్ ల గురించి ఖాతాదారులకు వసంత పూర్తిస్థాయిలో వివరించారు. ఇంటింటికీ వెళ్లి బ్యాంక్ ఖాతాదారులకు అవగాహన కరపత్రాలు అందజేశారు.
 
Tags:Utilize digital banking services.

Natyam ad