డిసెంబరు 19 నుండి జనవరి 8 వరకు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:
ఈనెల 19వతేదీ నుంచి జనవరి 8వరకు భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరగనున్నాయి. ఈమేరకు ఉత్సవాల పోస్టర్ ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శనివారం ఆవిష్కరించారు. కాగా. ఈనెల 28వతేదీన తెప్పోత్సవం జరగనుంది. అలాగే 29వతేదీన ఉత్తరద్వార దర్శనం ఉంటుంది. ఈ సందర్బంగా రామాలయానికి భక్తులు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశమున్నందున ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని దేవాలయం అధికారులను మంత్రులు ఆదేశించారు.
Tag : Vaikunta Ekadashi, celebrations from ,December 19th, to January 8th


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *