వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న ‘రంగ రంగ వైభవంగా’ షూటింగ్ ఓ పాట మినహా పూర్తి.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభం.

సినిమాముచ్చట్లు:
‘ఉప్పెన’ సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన యువ క‌థానాయ‌కుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో గిరీశాయ ద‌ర్శ‌కుడిగా బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘రంగ రంగ వైభ‌వంగా’. కేతికా శ‌ర్మ హీరోయిన్‌. ఒక సాంగ్ మిన‌హా సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది. సినిమా ఔట్‌పుట్‌పై మేక‌ర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ డైరెక్షన్‌లో ల‌వ్, ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్ క‌ల‌గ‌లిసిన ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న రంగ రంగ వైభ‌వంగా చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మయ్యాయి. రీసెంట్‌గా విడుద‌లైన టైటిల్ టీజ‌ర్‌, పాట‌కు ఆడియెన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వ‌చ్చింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం సినిమాకు మేజ‌ర్ హైలైట్‌గా నిలుస్తుంది. శ్యామ్ ద‌త్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ డేట్ ప్ర‌క‌టిస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు.
 
Tags:Vaishnav Tej’s upcoming shooting for ‘Ranga Ranga Vaibhavanga’ is complete except for one song.
Begin post-production programs.

Natyam ad