వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలి
పుంగనూరు ముచ్చట్లు:
వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని వాల్మీకి కుల సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో సంఘ నాయకులు విశ్రాంత డిఎస్పీ సుకుమార్బాబు, డాక్టర్ శివ, అద్దాల నాగరాజ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సుకుమార్ బాబు మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించేందుకు పోరాటం చేయాలన్నారు. ప్రతి ఒక్కరు ఐకమత్యంతో సిద్దంకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన వాల్మీకులు హాజరైయ్యారు.
Tags: Valmiki should be identified as ESTs