శాంతించిన వంశధార, నాగావళి

Date:17/07/2018
శ్రీకాకుళం ముచ్చట్లు:
సోమవారం వరకు వరద నీటితో ఉదృతంగా  వున్న వంశధార, నాగావళి నదులు మంగళవారం నాటికి  శాంతించాయి. వంశధార నదిలో ఇన్ ఫ్లో 13000 క్యూసెక్కుల, ఔట్ ఫ్లో 13000 క్యూసెక్కులుంది.  గొట్టా బ్యారేజీ వద్ద 22 గేట్లను ఎత్తి వేసి వచ్చిన వరద నీటిని వచ్చి నట్లే దిగువకు విడుదల చేసారు.  నాగావళి నదిలో ఇన్ ఫ్లో 15000 క్యూసెక్కుల, ఔట్ ఫ్లో 15000 క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదయింది.     తోటపల్లి, మడ్డువలస రిజర్వాయర్ ల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసారు. రెండు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసారు.  ఆయా మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో కూడా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసారు. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు  చేపల వేటకు వెళ్లవద్దని జిల్లా కలెక్టర్ ధనుంజయ రెడ్డి ఆదేశించారు. రక్షిత చర్యలకు సిద్దంగా వున్నామని  జిల్లా ఎస్పీ త్రివిక్రమ వర్మ తెలిపారు.
శాంతించిన వంశధార, నాగావళిhttp://www.telugumuchatlu.com/vandavara-vasanthara-nagavali/
Tags: Vandavara Vasanthara, Nagavali

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *