Varma comment on 'unknown name'

‘అజ్ఞాతవాసి’ సినిమాపై వర్మ కామెంట్‌

Date:31/12/2017

హైదరాబాద్‌ముచ్చట్లు:

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఈ చిత్రం టీజర్‌ అద్భుతంగా ఉందని ఇటీవల సోషల్‌మీడియా వేదికగా ప్రశంసించిన ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మళ్లీ సినిమా ప్రచార చిత్రాల్ని ఉద్దేశించి మాట్లాడారు. కొత్తగా విడుదలైన ‘అజ్ఞాతవాసి’ పోస్టర్లను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఇందులో పవన్‌ హావభావాల గురించి ప్రస్తావించారు.పవన్‌ చేతులు కట్టుకుని నిల్చొని ఉన్న పోస్టర్‌ను ఉద్దేశిస్తూ.. ‘నేను నా గత జన్మలో కూడా ఇలాంటి యాటిట్యూడ్‌ ఉన్న అతన్ని చూడలేదు. రజనీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌ ఎందుకు పనికిరారు పీకే (పవన్‌కల్యాణ్‌) ముందు.. బ్రూస్‌లీకి మొగుడిలా ఉన్నాడు’ అని వర్మ అన్నారు. పవన్‌ ఎడమ చేయితో కుడి చేయి మనికట్టుని పట్టుకుని కోపంగా చూస్తున్న పోస్టర్‌ను ఉద్దేశిస్తూ.. పవన్‌ గొప్ప అందగాడు అనే అర్థం వచ్చేలా రాశారు.త్రివిక్రమ్‌ ‘అజ్ఞాతవాసి’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తిసురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. అనిరుధ్‌ స్వరాలు అందించారు. ఖుష్బూ, బొమన్‌ ఇరానీ, ఆదిపినిశెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Tags:Varma comment on ‘unknown name’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *