Veeradi Veera .. Shourievara .. Trump!

వీరాధి వీర.. శౌర్యవీర.. ట్రంప్‌!

సాక్షి

Date :16/01/2018

అమెరికా అధ్యక్షుడికి అఫ్ఘాన్‌ ప్రజల అవార్డు

కాబూల్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను అఫ్ఘానిస్థాన్‌ వాసులు అరుదైన అవార్డుతో సత్కరించారు. ఆయనకు ‘మెడల్‌ ఆఫ్‌ బ్రేవరీ’ (శౌర్యవీర) అవార్డును ప్రకటించారు. ఉగ్రవాదంపై ద్వంద్వ విధానాలు పాటిస్తున్న పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ట్రంప్‌ ఇటీవల కఠిన నిర్ణయం తీసుకోవడంతో ఆయనకు ఈ అవార్డు ప్రకటిస్తున్నట్టు అఫ్గాన్‌లోని లోగర్‌ ప్రావిన్స​ వాసులు తెలిపారు.

బంగారంతో రూపొందించిన ఈ మెడల్‌పై అఫ్ఘాన్‌ ప్రజల తరఫున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఈ శౌర్యపతాకం’ అని పేర్కొన్నట్టు లోగర్‌ ప్రాంత నాయకుడు ఫర్హాద్‌ అక్బరీ తెలిపారు. 45వేల అఫ్ఘానీస్‌ (645 డాలర్ల) వ్యయంతో ఈ మెడల్‌ను రూపొందించారు. ఒకవైపు ఉగ్రతండాలను ప్రోత్సహిస్తూ.. మరోవైపు ఉగ్రవాదంపై పోరులో ఆర్థిక సాయం పొందుతున్న పాక్‌ తీరును ఖండిస్తూ.. ఆ దేశానికి ఆర్థిక సహాయాన్ని నిలిపివేయబోతున్నట్టు ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags : Veeradi Veera .. Shourievara .. Trump!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *