కడప జిల్లా ప్రొద్దుటూరులో వెంకయ్య పర్యటన

Date : 09/12/2017
కడప ముచ్చట్లు:
ప్రొద్దుటూరులో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించారు. స్థానిక అనిబిసెంట్ మునిసిపల్ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఫైలాన్ను వెంకయ్య ఆవిష్కరించారు. అనిబిసెంట్ పాఠశాలకు వేంపల్లి సుబ్బిరెడ్డి స్థలం ఇచ్చారని, ఇప్పటి నేతలు భూములు ఎలా తీసుకోవాలా అని చూస్తున్నారని సుబ్బిరెడ్డి ధర్మగుణాన్ని వెంకయ్య ప్రశంసించారు. కడప, బయ్యారంలో స్టీల్ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి సుముఖత వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందన్నారు. ప్రొద్దుటూరుకు చాలా సార్లు వచ్చానని, తన వ్యక్తిగత కార్యదర్శి సత్యకుమార్ది ఇదే ఊరని, ప్రొద్దుటూరు విద్య, వాణిజ్యం, బంగారు షాపులకు కేంద్రమని వెంకయ్య వివరించారు.ఈ కార్యక్రమానికి మంత్రులు సోమిరెడ్డి, నారాయణ, ఆదినారాయణరెడ్డి హాజరైనారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *