Venkateshwara Hecheries Incident - Misadventures Minister Amarnath Reddy

వెంకటేశ్వర హేచరీస్ ఘటన దురదృష్టకరం – భాదిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి అమరనాథ్ రెడ్డి

Date:27/02/2018

పలమనేరు ముచ్చట్లు:

పలమనేరు సమీపంలోని వెంకటేశ్వర హేచరీస్ లో ఇదే నెల ఫిబ్రవరి 2 న జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమైనదని రాష్ట్ర పరిశ్రమలశాఖా మంత్రి అమరనాథ్ రెడ్డి అన్నారు. వెంకటేశ్వర హేచరీస్ ప్రమాదంలో మృతి చెందిన ఏడు మంది కార్మిక కుటుంబ సభ్యులను ఆయన మంగళవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే భాదితులకు అధికారులు, ప్రజాప్రతినిధులు అందించిన సహాయక చర్యలు మరువలేనివన్నారు. తమ ప్రభుత్వం భాదిత కుటుంబాలకు అధిక మొత్తంలో సుమారు రూ.1. 80 లక్షలు ఆర్థిక సహాయం అందిచిన ఘనత తెదేపా ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసిలు, తెదేపా మండల అధ్యక్షులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Tags: Venkateshwara Hecheries Incident – Misadventures Minister Amarnath Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *