చాలా సంతోషంగా ఉంది : ఇవాంకా

హైదరాబాద్ ముచ్చట్లు:
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ట్రంప్కు సలహాదారు అయిన ఇవాంక ట్రంప్ జీఈఎస్ కోసం విచ్చేస్తున్న సందర్భంగా నగరాన్ని ఎంతో సుందరంగా ముస్తాబు చేశారు. ఈ తెల్లవారుజామున 3.30కు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అక్కడ నుంచి భారీ భద్రత మధ్య ట్రైడెంట్ హోటల్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఏర్పాటు చేసిన కాన్వాయ్ కళ్లు చెదిరే రీతిలో ఉంది.భారత పర్యటన పట్ల ఆమె ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. తనను సాదరంగా ఆహ్వానించడం చాలా ఉత్సాహంగా ఉందంటున్నారు ఇవాంకా ట్రంప్. భారత్ గురించి మరింతగా తెలుసుకోవడానికి, భారత్ మొత్తం పర్యటించడానికి త్వరలోనే మళ్లీ వస్తానని ఆమె చెప్పారు.రెండు దేశాల ప్రాధాన్యాలు, ఆర్థిక వృద్ధి ప్రచారాలు, ఆర్థిక సంస్కరణలు, ఉగ్రవాదంపై పోరు, భద్రతా సహకార విస్తరణ ఒక్కటే అని ఆమె అన్నారు.ఆర్థిక అవకాశాల సృష్టి, ఆర్థిక స్వావలంబన కల్పనలే ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాళ్లని ఆమె అన్నారు. అమెరికా ప్రజల సమస్యల పరిష్కారానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృషి చేస్తున్నట్టే.. ప్రధాని నరేంద్ర మోదీ కూడా భారత పౌరులకు, ప్రత్యేకించి మహిళలకు అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించి పనిచేస్తున్నారని ప్రశంసలు కురిపించారు.మహిళా పారిశ్రామికవేత్తల సాధికారతను ప్రపంచానికి తెలియజేసేలా నిర్వహిస్తున్న జీఈఎస్ 2017.. ప్రపంచ సంరంభంగా నిలుస్తుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే దేశాలు, ప్రాంతాలు మనగలుగుతాయని ఇవాంక చెప్పుకొచ్చారు.
Tag : Very happy: Ivanca


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *