విజిలెన్స్ దాడులు….

విశాఖపట్నం ముచ్చట్లు:
వంట నూనెపై కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయి స్తున్నరన్న సమాచారం మేరకు విశాఖ నగరంలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పలు మార్ట్ లలో విస్తత సోదాలు చేపట్టారు. ఈ మేరకు జిల్లాలో ఐదు బందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తునట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. విశాఖ విఐపి రోడ్, బుల్లయ కాలేజ్ కూడలి వద్ద స్పెన్సర్స్లో సోదాలు నిర్వహించారు. మధురవాడ విజేత సూపర్ మర్కెట్ లో వంట నూనె ను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించినట్లు విజి లెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అదన పు ఎస్పి స్వరూపరాణి తెలిపా రు. అనకాపల్లి వద్ద నూనె తయారీ కేంద్రం నిర్వహకుడు మిల్లర్ తూనికల్లో అక్ర మాలు గుర్తించి కేసు నమోదు చేసిన ట్లు వెల్లడించారు. ఇకపై సోదాలు కొనసాగుతాయని స్పష్టం చేసిన విజిలెన్స్ అధికారులు వంట నూనె విక్రయలపై అధిక ధరలు వసూలు చేస్తే నేరుగా విజిలెన్స్ అధికారులకు సమాచారమివ్వాలని సూచించారు.
 
Tags:Vigilance attacks

Natyam ad