దుకాణాల్లో విజిలెన్స్ దాడులు…
ఏలూరు ముచ్చట్లు:
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలోని సత్రంపాడు ప్రాంతంలో గల కిరీటి జనరల్ స్టోర్, పద్మావతి మాల్, కె ఆర్.షాపింగ్ మాల్ దుకాణాల్లో విజులెన్సు ఆధికారులు దాడులు జరిపారు. వంట నూనె ఎమ్మార్పీ ధరలకంటే అధికంగా విక్రయిస్తున్నారనే సమాచారం తో విజులెన్సు డిఎస్పీ వెంకటేశ్వర రావు, సి ఐ విల్సన్ ల ఆధ్వర్యంలో దాడులు చేసి కేసులు నమోదు చేసారు.
Tags:Vigilance raids on stores